తమిళ స్టార్ డైరెక్టర్ తో పవర్ స్టార్ సినిమా
టాలీవుడ్ లో స్టార్ల పుట్టిన రోజు సందర్భంగా వారు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, అనౌన్స్‌మెంట్స్ వస్తూ ఉంటాయి.
By: Sravani Lakshmi Srungarapu | 30 Aug 2025 1:24 PM ISTటాలీవుడ్ లో స్టార్ల పుట్టిన రోజు సందర్భంగా వారు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, అనౌన్స్‌మెంట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచితే, మరికొన్ని సర్‌ప్రైజ్ ను ఇస్తాయి. అయితే ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ నెక్ట్స్ లెవెల్ లో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడో న్యూస్ వినిపిస్తోంది.
వీరమల్లుతో అసంతృప్తి
రీసెంట్ గా హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు. చాలా కాలం తర్వాత పవన్ ను స్క్రీన్ పై చూశామనే సంతృప్తి తప్పించి వీరమల్లు ద్వారా ఫ్యాన్స్ సంతోషించిందేమీ లేదు. వీరమల్లు ఫ్లాపవడంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజి సినిమాపైనే ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఓజి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓజిపైనే ఆశలన్నీ!
ఇప్పటికే ఓజి షూటింగును పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తే పవన్ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తవుతాయి. ఏపీ రాజకీయాల్లో పవన్ బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ అసలు తర్వాత సినిమాలు చేస్తారా లేదా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో ఇప్పుడో వార్త ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
శాండిల్‌వుడ్ నిర్మాత కె. వెంకట నారాయణ తో కలిసి కెవిఎన్ ప్రొడక్షన్స్ లో ఓ సినిమా చేయనున్నారని, ఈ సినిమాకు ఓ తమిళ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన పవన్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2న వెల్లడయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
