పవన్ స్పూర్తితో బుచ్చిబాబు దర్శక ప్రయాణం!
ఆ సమయంలో బుచ్చిబాబు స్నేహితుడు ఒకరు తొలి ప్రేమ సినిమా చూసి , అందులోని సన్నివేశాలను, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్‌ను వివరిస్తూ పూర్తిగా మైమరిచిపోయారట.
By: Srikanth Kontham | 16 March 2026 1:38 PM ISTప్రతి దర్శకుడికి ఒక గురువు, స్పూర్తి ఉంటారు. బుచ్చిబాబుకు దర్శకత్వ మెళకువలు నేర్పిన గురువు డైరెక్టర్ సుకు మార్ అయితే, అసలు తనలో ఒక దర్శకుడు కావాలనే బలమైన కోరికను, స్పూర్తిని నింపింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని తాజాగా వెలుగులోకి వచ్చింది. `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈ విషయాన్ని బుచ్చిబాబు తెలిపారు. అంటే బుచ్చిబాబు దర్శకత్వ ప్రయాణం కాకినాడ వీధుల్లోనే మొదలైందని చెప్పాలి. ఆయన అక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే పవన్ కళ్యాణ్ నటించిన `తొలిప్రేమ` చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది.
ఆ సమయంలో బుచ్చిబాబు స్నేహితుడు ఒకరు తొలి ప్రేమ సినిమా చూసి , అందులోని సన్నివేశాలను, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్‌ను వివరిస్తూ పూర్తిగా మైమరిచిపోయారట. తన స్నేహితుడిలో ఆ సినిమా కలిగించిన ఇంపాక్ట్ చూసి బుచ్చిబాబు ఆశ్చర్యపోయారు. ఒక సినిమా మనిషిని ఇంతలా ప్రభావితం చేయగలదా? అని ఆలోచించిన బుచ్చిబాబుకు అప్పుడే తాను కూడా దర్శకుడు కావాలనే ఆలోచనకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ `తొలిప్రేమ` సినిమా బుచ్చిబాబు జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకూ బుచ్చిబాబు పరిశ్రమకు రావడానికి కారణం అంతా సుకుమార్ అనుకుంటున్నారు.
సుకుమార్ బుచ్చిబాబుకు లెక్కలు చెప్పిన గురువు కావడంతో? సుకుమార్ పరిశ్రమలో పెద్ద దర్శకుడు కావడంతో తాను కూడా గురువు లాగే దర్శకుడు అవ్వాలనుకుని వచ్చారని అనుకున్నారంతా. కానీ బుచ్చిబా తాజా వివరణతో క్లారిటీ వచ్చేసింది. ఆ రకంగా సుకుమార్ డైరెక్టర్ గా గురువు అయితే? దర్శకుడు అవ్వాలనే ఆలోచనకు పవన్ స్పూర్తిగా నిలిచారు. అలా బుచ్చిబాబు సుకుమార్ వద్ద శిష్యరికం మొదలైంది. బుచ్చిబాబు తొలి సినిమా `ఉప్పెన` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. తన మేకింగ్‌లో గురువు సుకుమార్ మార్క్ చూపిస్తున్నారు.
ప్రస్తుతం బుచ్చిబాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తన తదుపరి చిత్రాన్ని `పెద్ది`ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ అంటే పవన్ కి కుమారుడు. ఆ రకంగా మెగా కాంపౌండ్ లో కి బుచ్చిబాబు రెండవ సినిమాతోనే ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా పవన్ ముందు మైక్ పట్టుకుని మాట్లాడారు. మరి భవిష్యత్ లో తనలో స్పూర్తిని నింపిన పవన్ ని బుచ్చిబాబు డైరెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. `పెద్ది` భారీ విజయం సాధిస్తే బుచ్చిబాబు తర్వాత సినిమా పవన్ కళ్యాన్ తో ఉన్నా? సర్ ప్రైజ్ అవ్వొద్దు సుమీ. ఎందుకంటే బుచ్చిబాబు తదుపరి చిత్రం ఇంకా ఏ హీరోతోనూ లాక్ అవ్వలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉంటుందనే వార్త తప్ప అందులో నిజం లేదు. `పెద్ది` రిలీజ్ అనంతరం బుచ్చిబాబు మూడవ సినిమా హీరో ఎవరు? అన్నది కన్పమ్ అవుతుంది.
