Begin typing your search above and press return to search.

OG ఈవెంట్: వర్షం పడినా.. అసలు హైలెట్ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓజీ మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   22 Sept 2025 12:05 PM IST
OG ఈవెంట్: వర్షం పడినా.. అసలు హైలెట్ ఇదే!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓజీ మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజిత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందించారు.

అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన మేకర్స్.. సెప్టెంబర్ 25వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో రీసెంట్ గా స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా ఓజీ కన్సర్ట్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. దీంతో పవన్ అభిమానులు సహా వేలాది మంది సినీ ప్రియులు.. వేడుకకు వచ్చారు.

కానీ ఈవెంట్ అంతా వర్షం వల్ల నిరాశపరిచింది. బహిరంగ వేదికలో కార్యక్రమం నిర్వహించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆలస్యంగా ఈవెంట్ ప్రారంభమవ్వగా.. మధ్యలో ఓసారి ఆగింది కూడా. క్యాస్టింగ్ ఎవరూ మాట్లాడలేకపోయారు. సుజీత్ తన పవర్ ఫుల్ స్పీచ్ తో బజ్ పెంచుతారని ఎక్స్పెక్ట్ చేశారు.

మిగతా క్యాస్టింగ్ కూడా మాట్లాడతారని అంచనా వేశారు. కానీ మొత్తం అనుకున్నట్లు అసలు జరగలేదు. వర్ష ప్రభావం ఈవెంట్ పై గట్టిగా పడింది. అయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీతోపాటు స్పీచ్ కు అంతా ఫిదా అయ్యారు. ఈవెంట్ లో అదొకటే పాజిటివ్ ఎలిమెంట్ గా కనిపించింది. ఆ ఒక్కటి తప్ప మిగతా అన్నీ నిరాశపరిచాయి.

అయితే గ్యాంగ్ స్టర్ గెటప్ లో పవన్ ఎంట్రీ అదిరిపోయింది. ఆయన ఎంట్రీని చూసి అంతా స్టన్ అయ్యారు. అదే సమయంలో ఈవెంట్ లో పవన్ వాషి ఓ వాషి సాంగ్ పాడటం ప్రధాన హైలైట్ గా నిలిచింది. అభిమానులు, సినీ ప్రియులు ఓజీ.. ఓజీ అంటూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఓ రేంజ్ లో పవన్ సాంగ్ ను ఎంజాయ్ చేశారు.

కాగా, ఆ పాటను సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పాడిన విషయం తెలిసిందే. జపనీస్ హైకూ (చిన్న కవిత) వాషి యో వాషి.. అంటూ సాగే సాంగ్ జపనీస్ పదాలతో అల్లుకుని ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఓజీ సినిమాలో విలన్ పాత్ర ఓమి (ఇమ్రాన్ హష్మీ)కి వార్నింగ్ ఇస్తున్నట్లు సాంగ్ సాగుతుంది. ఇప్పుడు దాన్ని పవన్.. ఈవెంట్ లో పాడడం మెయిన్ హైలెట్ గా నిలిచింది.