Begin typing your search above and press return to search.

'ఉస్తాద్' ఇంటర్వెల్ సీక్వెన్స్.. గూస్ బంప్స్ పక్కానట!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందే హాట్ టాపిక్ గా మారుతోంది.

By:  M Prashanth   |   16 March 2026 6:03 PM IST
ఉస్తాద్ ఇంటర్వెల్ సీక్వెన్స్.. గూస్ బంప్స్ పక్కానట!
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందే హాట్ టాపిక్ గా మారుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆ చిత్రం నుంచి వచ్చిన తాజా అప్డేట్.. అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ చూసిన కొందరు క్రిటిక్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకోవడంతో మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

సోషల్ మీడియా వేదికగా కొందరు క్రిటిక్స్, ఇండస్ట్రీ వర్గాలకు చెందిన వ్యక్తులు సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ చూసిన అనుభవాన్ని వివరించారు. "ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ చూశాను. గూస్‌ బంప్స్ వచ్చాయి. ఈసారి థియేటర్లు బద్దలవుతాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. హరీష్ శంకర్ టేకింగ్‌ లో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌ లు, పవర్‌ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి" అని వారు పేర్కొన్నారు.

అలాగే సంగీత దర్శకుడు ఎస్. తమన్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మెయిన్ అసెట్ గా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తమన్ వర్క్.. థియేటర్లలో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. కొన్ని సన్నివేశాల్లో బీజీఎం థియేటర్ల పైకప్పులు ఎగిరిపోయేంత స్థాయిలో ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.

సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా పవర్‌ ఫుల్‌ గా ఉండబోతోందని కూడా క్రిటిక్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ బ్లాక్‌ లో పవన్ కళ్యాణ్ అత్యంత ఫెరోషియస్‌ గా కనిపిస్తారని పేర్కొన్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఎలివేషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంటాయని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్.. నటించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక దర్శకుడు హరీష్ శంకర్‌ తో పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌ కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఉస్తాద్ పై అంచనాలు మరింత పెరిగాయి.

ఇదిలా ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూస్ సినిమాపై హైప్‌ ను పెంచుతున్నాయి. అయితే మూవీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ తుది ఫలితాన్ని నిర్ణయించనుంది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.