పవన్ ఆ రిస్క్ చేస్తాడా?
కానీ మొదటి భాగానికి మిశ్రమ స్పందన రావడంతో అందరికీ సెకండ్ పార్ట్ పై సందేహాలు మొదలయ్యాయి. దీంతో హరి హర వీరమల్లు సినిమాకు సీక్వెల్ వస్తుందా లేదా అని అంతా అనుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 28 Jan 2026 12:00 PM ISTపవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 2019లో మొదలుపెట్టిన సినిమా హరి హర వీరమల్లు. పలు కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యమవడం, కొన్ని కారణాల వల్ల డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావడంతో ఏ.ఎం జ్యోతికృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల్ని తీసుకుని ప్రాజెక్టు మొదలైన ఆరేళ్ల తర్వాత ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని 2025లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
వీరమల్లుకు మిక్డ్స్ రెస్పాన్స్
మంచి అంచనాలతో రిలీజైన వీరమల్లు సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు ముందే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ మొదటి భాగానికి మిశ్రమ స్పందన రావడంతో అందరికీ సెకండ్ పార్ట్ పై సందేహాలు మొదలయ్యాయి. దీంతో హరి హర వీరమల్లు సినిమాకు సీక్వెల్ వస్తుందా లేదా అని అంతా అనుకున్నారు.
వీరమల్లు సీక్వెల్ పై సందేహాలు
మొదటి భాగం రిజల్ట్ తేడా కొడితే సెకండ్ భాగాన్ని ఆపేయడం ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చూడటంతో వీరమల్లుకి కూడా సెకండ్ పార్ట్ ఉండదని అంతా చెప్పారు. కానీ పవన్ మరియు సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ మాత్రం వీరమల్లు2కు సంబంధించి ఇప్పటికే 20-30 శాతం షూటింగ్ కూడా పూర్తైందని చెప్పడంతో ఆడియన్స్ ఈ సీక్వెల్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
వీరమల్లు2 కథ సిద్ధం
ఇదిలా ఉంటే హరి హర వీరమల్లు2 గురించి టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినమిఆకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని, కథను పవన్ కళ్యాణ్ కు నెరేషన్ ఇవ్వడానికి డైరెక్టర్ జ్యోతికృష్ణ వెయిట్ చేస్తున్నారని, అంతా అనుకున్నట్టు జరిగితే వీరమల్లు కోసం పవన్ మరోసారి డేట్స్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరి పవన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అసలే ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ ఇకపై సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయాలని, వాటితో నిర్మాతలు కూడా లాభపడాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరమల్లు2 చేసి రిస్క్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
