సుజిత్ కు పవన్ గిఫ్ట్ వెనుక ఇంత కథ ఉందా?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్.. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ చేసిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 19 Dec 2025 12:49 AM ISTటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్.. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ చేసిన విషయం తెలిసిందే. పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిన సుజిత్.. తన అభిమాన హీరో బాడీ లాంగ్వేజ్ కు సరిపడా కథతో మూవీ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులను ఓ రేంజ్ లో మెప్పించారని చెప్పాలి.
అయితే రీసెంట్ పవర్ స్టార్ నుంచి సుజిత్.. అద్భుతమైన బహుమతి అందుకున్న సంగతి విదితమే. యంగ్ డైరెక్టర్ కు పవన్ కళ్యాణ్.. లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రముఖ కార్ల కంపెనీ లాండ్ రోవర్ కు చెందిన రేంజ్ రోవర్ కారును ఇచ్చారు. ఇటీవల ఆ విషయాన్ని సుజిత్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వెల్లడించారు.
"నేను అందుకున్న గిఫ్టుల్లో ఇది అత్యుత్తమమైనది. మాటల్లో చెప్పలేనంత ఆనందంతో ఉన్నా. నా అత్యంత ప్రియమైన ఓజీ, కళ్యాణ్ గారి నుంచి లభించిన ప్రేమ, ప్రోత్సాహం నాకు అన్నిటికన్నా ముఖ్యం. ఆయన అభిమానిగా మొదలై ఈ క్షణం వరకు నిజంగా అద్భుతం. జీవితంలో ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా" అంటూ రాసుకొచ్చారు.
అయితే ఆ విషయం అప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. అదేంటంటే.. ఓజీ సినిమాతో అందరినీ మెప్పించినందుకే కారు గిఫ్ట్ గా ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు కారణం అది కాదట. ఆ రీజన్.. ఓజీ మూవీ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ కు సంబంధించినదని టాక్.
ఓజీ మూవీకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ను జపాన్ లో షూట్ చేయాలని సుజిత్ ప్లాన్ చేశారట. కానీ అప్పటికే బడ్జెట్ ఎక్కువవడంతో నిర్మాత అందుకు ఒప్పుకోలేదని వినికిడి. కానీ ఆ సీన్స్ ను అక్కడ షూట్ చేస్తేనే.. మూవీకి సరిపోతాయని సుజిత్ భావించారట. ఎలాగైనా జపాన్ లో చిత్రీకరించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
దీంతో జపాన్ షెడ్యూల్ కోసం డబ్బులు అడ్జస్ట్ చేయడానికి సుజిత్ తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ ను అమ్మేశారని సమాచారం. ఆ డబ్బుతో జపాన్ కు వెళ్లి, కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారట. ఆ విషయం మూవీ డబ్బింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి రాగా.. ఆయన తెలుసుకుని ఇంప్రెస్ అయ్యారట!
అందుకే సినిమా కోసం డైరెక్టర్ తన సొంత వాహనాన్ని అమ్ముకోగా.. అదే మోడల్ కారు గిఫ్ట్ గా ఇవ్వాలని అప్పుడే పవన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ను సుజిత్ కు ఇచ్చారట. ఆ లగ్జరీ కారు సంబంధించిన ఈఎంఐలు కూడా పవన్ కళ్యాణే చెల్లించనున్నారని టాక్. ఇప్పుడు ఈ విషయం నెట్టింట ఫుల్ వైరల్ అవుతుండగా.. నిజమెంతో పవన్, సుజిత్ కే తెలియాలి.
