పవన్ ఫ్యాన్స్ గుండెల మీద చేయేసుకోవచ్చు!
పవన్ కళ్యాణ్ కొంత కాలాంగా రాజకీయాలు..సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే.
By: Srikanth Kontham | 2 Sept 2025 9:00 PM ISTపవన్ కళ్యాణ్ కొంత కాలాంగా రాజకీయాలు..సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. రెండు వైపులా పరుగులు తీయడం కష్టంగా ఉన్నా? ప్రజల కోసం రాజకీయాలు..అభిమానుల కోసం సినిమాలు తప్పడం లేదు. ఈ క్రమంలో కమిట్ అయిన చిత్రాలన్నీ పూర్తయిన తర్వాత పవన్ రెండేళ్ల పాటు విరామం తీసుకుంటారని నెట్టింట ప్రచారంలోకి వచ్చింది. 'హరిహరవీరమల్లు' రిలీజ్ అవ్వడం ..`ఓజీ` షూటింగ్ పూర్తయిన అనంతరం `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా ముగించి రిలాక్స్ అవ్వడమే తరు వాయిగా మీడియా కథనాలు హీటెక్కించాయి.
విరామం లేకుండా:
మధ్యలో పవన్ కొంత అనారోగ్యానికి కూడా గురయ్యారు. వీటన్నింటి కారణంగా వచ్చే రెండేళ్ల పాటు, పవన్ ఎలాంటి సినిమాలు చేసే అవకాశం లేదని ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా పవన్ మూవ్ చూ స్తుంటే? సినిమాల నుంచి విరామం తీసుకునే ఆలోచన ఆయనలో ఎక్కడా కనిపించలేదు. గతంలో కమిట్ అయిన చిత్రాలను కూడా ఇప్పుడు పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. 2026 నుంచి పవన్ మరింత బిజీగా ఉంటారని ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. రాజకీయాలు కంటే కూడా ఎక్కువగా సినిమా లపైనే దృష్టి పెడతారని లీకులందుతున్నాయి.
స్నేహితుడు కోసం రంగంలోకి:
దీనిలో భాగంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' పూర్తయిన వెంటనే నిర్మాత రామ్ తళ్లూరు బ్యానర్లో సినిమాను పట్టా లెక్కించాలనుకుంటున్నారుట. ఆ బ్యానర్లో పవన్ అడ్వాన్స్ తీసుకుని చాలా కాలమవుతోంది. ఐదేళ్ల క్రితమే ఆ బ్యానర్లో సినిమాకు కమిట్ అయ్యారు. కానీ ఇంత వరకూ బిజీ కారణంగా సాధ్యపడలేదు. రామ్ స్నేహితుడు కావడంతో? ఆయన్ని హోల్డ్ లో పెట్టి మిగతా సినిమాలు పూర్తి చేసుకుంటూ వచ్చారు. దీంతో రామ్ తళ్లూరి సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా స్నేహితుడి సినిమా పూర్తి చేయాలని పవన్ బలంగా సంకల్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
అభిమానుల్లో ఉత్సాహం:
ఇటీవలే కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ లో కూడా పవన్ ఓ సినిమాకు కమిట్ అయినట్లు ప్రచారం సాగుతోంది. ఆ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. దీనిలో భాగంగా రామ్ సినిమాతో పాటు, కేవీఎన్ చిత్రాన్ని కూడా సైమల్టేనియస్ గా ప్రారంభిం చాలని సన్నహాలు చేస్తున్నారుట. అలాగే కొత్తగా మరికొన్ని సంస్థల్లో కూడా పవన్ అడ్వాన్స్ లు తీసుకుం టున్నట్లు వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. ఈ ప్రచారంతో అభిమా నుల్లో ఉత్సాహం నెలకొంది.
