పవన్ కు ఇష్టమైన ఫుడ్ ఏంటి? అన్నాకు వంట వచ్చా?
మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, స్పెషల్ మూమెంట్స్ అభిమానులతో పంచుకుంటూ ఆమె నెటిజన్లకు మరింత దగ్గరవుతున్నారు. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో చిట్ చాట్ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.
By: M Prashanth | 8 April 2026 12:42 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన తర్వాత ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తక్కువ సమయంలో ఆమెకు మంచి ఫాలోయింగ్ రావడం గమనార్హం. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, స్పెషల్ మూమెంట్స్ అభిమానులతో పంచుకుంటూ ఆమె నెటిజన్లకు మరింత దగ్గరవుతున్నారు. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో చిట్ చాట్ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.
చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అన్నా లెజినోవా ఎంతో ఓపెన్ గా, కూల్ గా సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఆమె వంటకు సంబంధించిన విషయాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. 'మీకు వంట చేయడం వచ్చా?' అనే ప్రశ్నకు స్పందిస్తూ, 'మా అత్తమ్మ దగ్గర నేను చాలా వంటలు నేర్చుకున్నాను. దోస, ఇడ్లీ, చట్నీ, కర్రీలు, పప్పులు, ఫిష్ పులుసు, గోంగూర, పాలక్ పన్నీర్, ప్రాన్స్ ఇగురు, బిర్యానీ ఇలా ఎన్నో వంటకాలు చేయడం నేర్చుకున్నాను. ముఖ్యంగా వెజ్ వంటలు ఎక్కువగా నేర్చుకున్నా' అని తెలిపారు.
ఇక మరో అభిమాని పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆహారం గురించి ప్రశ్నించగా, ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'మా అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ వంటను నేను కూడా ఆమె దగ్గర నేర్చుకున్నాను. అలాగే ఆయన వదినమ్మ సురేఖ చేసే చేపల పులుసు కూడా ఆయన ఎంతో ఇష్టంగా తింటారు' అని వెల్లడించారు. ఈ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అన్నా లెజినోవా ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ అవుతున్నప్పటి నుంచి మెగా అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె పోస్టులు కేవలం ఫోటోలకే పరిమితం కాకుండా, కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా పంచుకుంటుండటం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యామిలీకి కోడలిగా మాత్రమే కాకుండా, తన ప్రత్యేకతను చూపించేలా ఆమె సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో ముందుకు సాగుతున్నారు.
అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఆమెను పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అనుభవాలు, రోజువారీ జీవితానికి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ ఆమె తన ఫాలోవర్స్ తో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటున్నారు. అభిమానులతో నేరుగా మాట్లాడటం, వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా ఆమె మరింత చేరువవుతున్నారు.
ప్రస్తుతం అన్నా లెజినోవా చిట్‌చాట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన వంటకాల గురించి ఆమె చెప్పిన విషయాలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో మమేకమవుతున్న అన్నా.. మెగా ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నారు. ఆమె చేసే ప్రతి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ.. అభిమానుల ఆసక్తిని పెంచుతోంది.
