అబ్బాయ్-బాబాయ్ స్ట్రిప్ట్ అంత వీజీ కాదే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌చాలా కాలంగా అనుకుంటున్నారు.
By: Srikanth Kontham | 8 Feb 2026 9:56 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌చాలా కాలంగా అనుకుంటున్నారు. రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ కాక ముందు నుంచే పవన్ మనసులో అబ్బాయ్ తో సినిమా చేయాలని ఉందని పలు సందర్భాల్లో బాహాటంగానూ ప్రకటించారు. తాజాగా పవన్ మళ్లీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని యాక్టివేట్ చేసిన సంగతి తెలిసిందే. పీపీల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్ తళ్లూరి నిర్మాణ సంస్థలతో అసోసియేట్ అయి సినిమాలు నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. ఇంత వరకూ ఒక్క ప్రాజెక్ట్ కూడా పట్టా లెక్కలేదు కానీ పవన్ మాత్రం సీరియస్ గానే నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలో రామ్ చరణ్ తో కూడా సినిమా చేసే అవకాశం ఉంది. అది ఇప్పటికిప్పుడు జరుగుతుందని చెప్పలేం కానీ పవన్ మనసులో మాత్రం ఆలోచన బలంగానే కనిపిస్తోంది. కానీ స్ట్రిప్ట్ లాక్ అవ్వడం మాత్రం అంత సులభం కాదు. రామ్ చరణ్ పాన్ ఇండియాను దాటి గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. తానిప్పుడు ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చేయాలి. కానీ ఇప్పుడున్న రైటర్ కం డైరెక్టర్లలో అందరికీ సాధ్యం కాదు. సెలక్టెడ్ గా చాలా కొద్ది మంది మాత్రమే పాన్ ఇండియా ఇమేజ్ ఆధారంగా సినిమాలు చేస్తున్నారు.
రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, నాగ వంశీ లాంటి వారే క్యూలో ఉన్నారు. ఇప్పటికే రాజ మౌళి తో పని చేసాడు. తదుపరి చిత్రం సుకుమార్ తోనే ఉంటుంది. మిగతా ముగ్గురితో రామ్ చరణ్ పనిచేయాల్సి ఉంది. వీరంతా చాలా బిజీగా ఉన్నారు. ఇదంతా పక్కన బెడితే? స్టోరీ లాక్ అవ్వడం అన్నది అంత ఈజీ కాదు. రామ్ చరణ్- పవన్ కళ్యాణ్ లను ఏక కాలంలో సమానంగా మెప్పించాల్సి ఉంటుంది. వారిద్దరు వంద శాతం సంతృప్తిగా ఉంటేనే అది కార్యరూపం దాల్చుతుంది. పవన్ కళ్యాణ్ కు నచ్చి రామ్ చరణ్ కు నచ్చకపోయినా సాధ్యం కాదు. రామ్ చరణ్ కు నచ్చి పవన్ కళ్యాణ్ కి నచ్చకపోయినా జరిగేది కాదు.
గతంలో పవన్ తాను నటించాల్సిన కథల విషయంలో చాలాసార్లు డైలమా కొనసాగింది. నచ్చింది ఒకే అని చెప్పి వదిలేసిన కథలు చాలా ఉన్నాయి. చరణ్ తో అలా ఉండదు. నచ్చింది అంటే తప్పక చేస్తాడు. ఇచ్చిన మాటకు కట్టుబడతాడు. బాబాయ్ మాటని అంత తొందరగా కొట్టేయలేడు. అలాగని నచ్చిన కథని వదులుకోలేడు. ఇలా కొన్ని సున్నితమైన అంశాలున్నాయి. ఏ డైరెక్టర్ రైటర్ కథ చెప్పినా? వీటన్నింటినీ ఆ ఇద్దరి వద్ద బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎంత గొప్ప స్టోరీ అయినా బ్యాలెన్స్ తప్పితే మాత్రం సాధ్యపడదన్నది అంతే వాస్తవం.
