Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఫ్యాన్స్ నిరాశ తీరేట్టుందిగా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప‌వ‌న్ నుంచి స‌రైన సినిమా వ‌స్తే రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో రీసెంట్ గా వ‌చ్చిన ఓజి మ‌రోసారి నిరూపించింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Nov 2025 2:21 PM IST
ప‌వ‌న్ ఫ్యాన్స్ నిరాశ తీరేట్టుందిగా!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప‌వ‌న్ నుంచి స‌రైన సినిమా వ‌స్తే రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో రీసెంట్ గా వ‌చ్చిన ఓజి మ‌రోసారి నిరూపించింది. ప‌వ‌న్ రాజకీయాల్లోకి వెళ్లిన‌ప్ప‌టి నుంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను త‌గ్గించి, కంటెంట్ బేస్డ్ సినిమాలు, రీమేక్‌లకే ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తూ వ‌చ్చారు. దీంతో ఫ్యాన్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లోని మాస్ ను మిస్ అవాల్సి వ‌చ్చింది.

అయితే రీసెంట్ గా వ‌చ్చిన ఓజి సినిమా ఆ ఆక‌లిని చాలా వ‌ర‌కు తీర్చింది. ఓజి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల‌, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో రూపొందుతున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

ప‌వన్- దేవీ క‌ల‌యిక‌లో ఎన్నో మ్యూజిక‌ల్ హిట్స్

గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ప‌వ‌న్, హ‌రీష్ క‌లయిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి. దేవీ శ్రీ, ప‌వ‌న్ కాంబినేష‌న్ లో ప‌లు సినిమాలు రాగా, ఆ సినిమాల‌న్నీ మంచి మ్యూజిక‌ల్ హిట్లుగా నిలిచాయి. అయితే దేవీ ట్యూన్ల‌కు ఎలాంటి వారికైనా కాలు క‌ద‌పాల‌నిపిస్తుంది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు డ్యాన్స్ అంటే పెద్ద‌గా న‌చ్చ‌దు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే చాలా సార్లు చెప్పారు. బ‌హుశా అందుకేనేమో చాలా సాంగ్స్ లో ఆయ‌న డ్యాన్స్ వేయ‌కుండా న‌డుచుకుంటూ వెళ్ల‌డం, చిన్న చిన్న మూమెంట్స్ లాంటివి వేస్తూ క‌నిపిస్తారు.

ప‌వ‌న్ డ్యాన్సుల‌ను మిస్ అవుతున్న ఫ్యాన్స్

అలా అని ప‌వ‌న్ కు డ్యాన్స్ రాదా అంటే అదేమీ లేదు. గ‌తంలో ఆయ‌న చాలానే హెవీ స్టెప్స్ వేశారు. ప‌వ‌న్ వేసిన స్టెప్పుల‌కు ఫ్యాన్స్, ఆడియ‌న్స్ కూడా ఎంతో ఎంజాయ్ చేశారు. కానీ ప‌వ‌న్ నుంచి అలాంటి ఎన‌ర్జీ చూసి చాలా కాల‌మ‌వ‌డంతో ఫ్యాన్స్ ఆయ‌న డ్యాన్స్ ను మిస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తో ఫ్యాన్స్ కు ఆ నిరాశ తీరేట్టు క‌నిపిస్తోంది.

డ్యాన్స్ చేయాల‌నిపిస్తోంద‌న్నారు

ఇప్ప‌టికే ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కు సంబంధించిన రెండు సాంగ్స్ ను షూట్ చేయ‌గా, ఆ సాంగ్స్ లో ప‌వ‌న్ చాలా ఎన‌ర్జీతో స్టెప్పులేశార‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్ర‌సాద్ రీసెంట్ గా ఓ సంద‌ర్భంలో చెప్పారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సాంగ్స్ విని, చాలా ఏళ్ల త‌ర్వాత త‌న‌కు మ‌ళ్లీ డ్యాన్స్ చేయాల‌నిపిస్తోంద‌ని త‌న‌తో అన్నార‌ని, స్క్రీన్ పై ఆయ‌న్ను చూసి అంద‌రికీ గూస్‌బంప్స్ వ‌చ్చాయ‌న్న దేవీ, చాలా కాలం త‌ర్వాత తిరిగి ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. దేవీ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే ఎంతో కాలంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ప‌వ‌న్ డ్యాన్సులు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ లో ఉండ‌టం ఖాయ‌మనే అనిపిస్తుంది. అదే జ‌రిగితే ప‌వ‌న్ ఫ్యాన్స్ నిరాశ తీరిన‌ట్టే అవుతుంది.