Begin typing your search above and press return to search.

ఓజీ 2పై పవన్ మార్క్ విజన్.. సుజీత్‌కు పవర్‌స్టార్ కీలక సలహా!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ఓజీ' భారీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో 'ఓజీ2' కి స‌న్నాహాకాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   7 July 2026 10:00 PM IST
ఓజీ 2పై పవన్ మార్క్ విజన్.. సుజీత్‌కు పవర్‌స్టార్ కీలక సలహా!
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ఓజీ` భారీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో `ఓజీ2 కి స‌న్నాహాకాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. సుజీత్ తనదైన శైలిలో భారీ యాక్షన్ దృశ్యాలను, ఎలివేషన్లను రూ పొందించడంలో దిట్ట. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సుజీత్‌కు చేసిన సూచన పరిశ్ర మలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ ఎలివేషన్లకే పరిమితం కాకుండా కథలో బలమైన ఎమోషన్ డెప్త్ ఉండాలని పవన్ సూచించిన‌ట్లు చేసినట్లు తెలుస్తోంది.స్టార్ హీరోల చిత్రాల్లో ఫ్యాన్స్ కోరుకునే అంశాలు వేరుగా ఉన్నప్పటికీ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టేది కథలోని లోతు మాత్రమేనని పవన్ నమ్ముతారు.

సుజీత్ గత చిత్రాలు `సాహో` లో విజువల్స్, యాక్షన్ భారీగా ఉన్నా? కథనంలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. బహుశా అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పరిణతి చెందిన వ్యక్తిగత అనుభవాలతో సుజీత్‌కు కీలక సలహా ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. యాక్షన్ అనేది కథను నడిపించే సాధనమే తప్ప కథే యాక్షన్ కాకూడదనేది ఉద్దేశం కావొచ్చు. ఈ సలహా వెనుక పవన్ కళ్యాణ్ దూరదృష్టి కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను నిలబెట్టాలంటే విజువల్ గ్రాండియర్ ఎంత ముఖ్యమో? ఎమోషనల్ కనెక్ట్ కూడా అంతే ముఖ్యం.

`ఓజీ 2`లో పవన్ పాత్ర పరిణామం సహజంగా ఉండాలి. గాలిలో ఎగిరే యాక్షన్ సీన్లు మాత్రమే కాకుండా ప్రేక్షకుడిని కదిలించే సన్నివేశాలు కావాలని ప‌వ‌న్ కోరుకుంటున్నారు. ఇది సుజీత్‌కు సవాలుగా మారినా? దర్శకుడిగా సుజిత్ స్థాయిని పెంచడానికి ప‌వ‌న్ స‌ల‌హా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత ట్రెండ్‌ను గమనిస్తే ప్రేక్షకులు విజువల్ ఫీస్ట్‌లకే పరిమితం కావడం లేదు. ఒక సినిమాను పదే పదే చూడాలంటే అందులో బలమైన డ్రామా ఉండాలి. పవన్ కళ్యాణ్ సూచించిన మార్పు `ఓజీ 2`ను సాధారణ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్థాయి నుంచి దాటి కల్ట్ క్లాసిక్‌గా మార్చే అవకాశం ఉంది.

సుజీత్ ఈ సలహాను ఎలా అందిపు చ్చుకుంటారో? స్క్రిప్టులో ఏ రకమైన భావోద్వేగాలను జోడిస్తారో ? చూడాలి. సినిమా నిర్మాణంలో నటుడు - దర్శకుడు మధ్య ఉండే ఇలాంటి ఆరోగ్యకరమైన చర్చలు సినిమా ఫలితాన్ని సానుకూలంగా మారుస్తాయి. సుజీత్ టెక్నికల్ బ్రిలియన్స్‌కు, పవన్ కళ్యాణ్ సూచించిన కథాంశపు లోతును తోడు చేస్తే మంచి ఫ‌లితాల‌కు అవ‌కాశం ఉంది. `ఓజీ 2` ఎలివేషన్ల కలయికగా కాకుండా బలమైన కథాంశంతో కూడిన మాస్టర్ పీస్‌గా నిలవాలని ఆశీద్దాం.