Begin typing your search above and press return to search.

అనుకున్నట్లు పూర్తి.. మళ్లీ రాజకీయాలతో పవన్ బిజీ!

రాజకీయాలను, చిత్రాలను సమతుల్యం చేసుకుంటూ కేవలం నాలుగు నెలల్లో మూడు సినిమాలు పవర్ స్టార్ కంప్లీట్ చేయడం విశేషం.

By:  M Prashanth   |   15 Sept 2025 3:25 PM IST
అనుకున్నట్లు పూర్తి.. మళ్లీ రాజకీయాలతో పవన్ బిజీ!
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన వంతు బాధ్యతను నెరవేర్చారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా సేవలందిస్తూ.. మరోవైపు తాను ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేశారు. రాజకీయాలను, చిత్రాలను సమతుల్యం చేసుకుంటూ కేవలం నాలుగు నెలల్లో మూడు సినిమాలు పవర్ స్టార్ కంప్లీట్ చేయడం విశేషం.

అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాలపై పూర్తి దృష్టి సారించిన పవన్.. తన చేతిలో ఉన్న సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో ఉండిపోయాయి. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత నుంచి అనేక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే 2025 ఏప్రిల్ నుంచి షూటింగ్స్ ను మళ్లీ ప్రారంభించారు పవన్. అనేక ఏళ్లుగా సెట్స్ పై ఉన్న వీరమల్లు మూవీని ముందు మే నెలలో పూర్తి చేశారు. ఆ సినిమా జులై చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

ఆ తర్వాత ఓజీ సెట్స్ లోకి అడుగుపెట్టారు. మూడు వారాల్లో ఆ సినిమాను కంప్లీట్ చేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. సెప్టెంబర్ 25వ తేదీన సినిమా అవ్వనుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా..బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ను పవన్ పూర్తి చేశారు.

జూన్ లో ఆ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన పవన్.. మేకర్స్ పెర్ఫెక్ట్ ప్లాన్ తో రీసెంట్ గా తన రోల్ కు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశారు. ప్రస్తుతం మూవీ టీమ్ తో ఆయన దిగిన పిక్ వైరల్ గా మారింది. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్.. తాను ఇప్పటికే చెప్పినట్టు.. అనుకున్నట్లు.. మూడు సినిమాలు పూర్తి చేశారు.

ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అవ్వనున్నారు. ఎందుకంటే నాలుగు నెలలుగా సినిమాల్లో నటిస్తూనే.. అటు బాధ్యతలు నిర్వహించిన ఆయన.. ఇప్పుడు పూర్తిస్థాయి పాలిటిక్స్ తో బిజీగా ఉండనున్నారు. వీరమల్లు ప్రమోషన్స్ లో తాను ఇకపై నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పిన పవన్.. భవిష్యత్తులో లీడ్ రోల్స్ లో నటిస్తారో లేదో చూడాలి. కానీ కొన్నాళ్లపాటు విరామమివ్వడం మాత్రం గ్యారంటీ.