Begin typing your search above and press return to search.

డిప్యూటీ CM క‌త్తి ప‌ట్టుకొస్తే ఊరుకుంటారా?

ఇక ఈ ఈవెంట్ లో వ‌ర్షం ప‌డుతుంటే, గొడుగులు ప‌ట్టుకుని ఒక సినిమా స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్నారా? అనిపించేలా.. ఓజీ టీమ్ చేసిన విన్యాసాలు ఆస‌క్తిని క‌లిగించాయి.

By:  Sivaji Kontham   |   22 Sept 2025 10:42 AM IST
డిప్యూటీ CM క‌త్తి ప‌ట్టుకొస్తే ఊరుకుంటారా?
X

ఓవైపు జోరున వ‌ర్షం.. మ‌రోవైపు ఓజీ ఫైరింగ్..! హైదరాబాద్ గ‌చ్చిబౌళి వేదిక‌గా కాన్సెర్ట్ చాలా స్పెష‌ల్ గా మారింది. వ‌ర్షంలో త‌డుస్తున్నా వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన `ఓజీ` ఫ్యాన్స్ మాత్రం అక్క‌డి నుంచి క‌ద‌ల‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక ఈ ఈవెంట్ లో వ‌ర్షం ప‌డుతుంటే, గొడుగులు ప‌ట్టుకుని ఒక సినిమా స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్నారా? అనిపించేలా.. ఓజీ టీమ్ చేసిన విన్యాసాలు ఆస‌క్తిని క‌లిగించాయి.

నేను డిప్యూటీ సీఎం అని మ‌ర్చిపోయాను! అంటూ ఓజీ క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ OG ప్ర‌చార‌ వేదిక‌పై వ్యాఖ్యానించారు. సుజీత్- థ‌మ‌న్ త‌న‌ను ఈ ప్ర‌యాణంలోకి లాగార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ ఇద్ద‌రూ సినిమా టోన్ మార్చార‌ని తెలిపారు. ''నేను ఒక డిప్యూటీ సీఎం అని మ‌ర్చిపోయాను. ఒక డిప్యూటీ సీఎం ఇలా క‌త్తి ప‌ట్టుకొస్తే ఊరుకుంటారా? ఎవ‌రైనా!'' అని ప్రేక్ష‌కులనుద్ధేశించి అడిగారు.

ఖుషీలో క‌టానా క‌త్తి ని తెచ్చాను .. ఈ క‌త్తి కావాలి అని ద‌ర్శ‌కుడిని అడిగితే దీనికి త‌గ్గ విధంగా ఒక ఫైట్ సెట్ చేసారు. ఈ సినిమాలో యాక్ష‌న్ క‌ట్.. స్టైలింగ్.. ఫ్యాష‌న్ సెన్స్ ప్ర‌తిదీ చాలా అద్భుతంగా చేసారు. డివోపీ లు ఇద్ద‌రూ చాలా క్లాసీగా విజువ‌ల్స్ ని తెర‌కెక్కించారు. ఈ సినిమాలో చాలా త‌క్కువ నిడివ‌లో ఒక ప్రేమ‌క‌థ‌ను కూడా చూపించారు సుజీత్. 80ల నాటి ప్రేమికురాలిగా ప్రియాంక మోహ‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. బ్యూటిఫుల్ విజువ‌ల్స్ తీసారు'' అని ప్ర‌శంసించారు.

వేదిక వ‌ద్ద త‌న కోసం విచ్చేసిన‌ జ‌న‌వాహినిని చూసాక డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆనందంతో ప‌ర‌వ‌శించారు. ''ఖుషీ అప్పుడు చూసాను ఇంత జోష్‌.. సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వెళ్లాక‌.. కొంత దూరంగా ఉన్నాను'' అని అన్నారు. ఈ సినిమా కోసం థ‌మ‌న్ బృందం ఒక‌ ర్యాప్ సాంగ్ కూడా చేసారు. అది చూసి తెలుగు కుర్రాళ్లేనా ఇది చేసింది అనుకుంటారు. అంత అద్భుతంగా ఆ పాట‌ను డిజైన్ చేసార‌ని కూడా తెలిపారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ - ప్రియాంక మోహ‌న్ - ఇమ్రాన్ హ‌ష్మి త‌దితరులు న‌టించిన ఓజీ ఈనెల 25న థియేట‌ర్ల‌లోకి విడుద‌ల‌వుతోంది. ప్రీరిలీజ్ వేడుక‌లో ట్రైల‌ర్ ని లాంచ్ చేయాల‌ని అనుకున్నా అది సాధ్య‌ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం ట్రైల‌ర్ రాక కోసం అభిమానుల్లో చాలా ఉత్కంఠ నెల‌కొంది.