Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మ‌న‌స్పూర్తిగా కోరుకుంటోన్న త‌రుణం!

ఏడాది కాలంలో ప‌వ‌న్ సినిమాల‌పై పాజిటివ్ గా మాట్లాడ‌టం గ‌మ‌నించ వ‌చ్చు. రాజ‌కీయం- సినిమా బ్యాలెన్స్ చేస్తాన‌ని..`ఓజీ` స‌మ‌యంలో? సుజిత్ లాంటి ద‌ర్శ‌కుడు ముందే త‌గిలి ఉంటే?

By:  Srikanth Kontham   |   13 Dec 2025 3:00 AM IST
ప‌వ‌న్ మ‌న‌స్పూర్తిగా కోరుకుంటోన్న త‌రుణం!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీరియ‌స్ గా సినిమాల్లో కొన‌సాగినంత కాలం సినిమాల‌పై అనాస‌క్తిని చాలా సంద‌ర్భాల్లో వ్య‌క్తం చేసారు. న‌టుడు అవ్వాల‌ని తానెప్పుడు ఆనుకోలేద‌ని..యాదృశ్చికంగా జ‌రిగింది త‌ప్ప స్టార్ అనే ఆలోచ‌న‌ త‌న‌కెప్పుడు లేద‌న్నారు. నిరాడంబ‌ర జీవితాన్నే తాను కోరుకున్న‌ట్లు దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ఆలోచ‌న‌ల‌తోనే ఇప్ప‌టికీ ఉంటాన‌ని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. స‌మాజానికి ఏదైనా చేయాల‌నే ఆలోచ‌న‌ల‌తోనే ఎప్పుడూ ఉండేవాడినని అన్నారు. ఆ ర‌కంగా ప‌వ‌న్ స‌మాజానికి చాలా సేవ కూడా చేసారు. రాజకీయాల్లో చేరితో తాను అనుకున్న‌ది ఇంకా గొప్పగా చేయోచ్చ‌ని..అధికారం చేతిలో ఉంటే మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా సేవ చేసే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

రాజ‌కీయాల్లో ఎన్నో ఆటుపోట్లు:

అందుకు త‌గ్గ‌ట్టే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. జ‌న‌సేన పార్టీ స్థాపించి ఎన్నోఆటు పోట్లు ఎదుర్కుని చివ‌రికి 2024 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే గా గెలిపొందారు. అక్క‌డ నుంచి డిప్యూటీ సీఎంగా ప‌దొన్న‌త‌ని పొందారు. సినిమా-రాజ‌కీయం మ‌ధ్య ప్ర‌యాణం సంద‌ర్భంలోనే సినిమాలు పూర్తిగా వ‌దిలేస్తాన‌ని..రాజ‌కీయాలే సీరియ‌స్ గా చేస్తాన‌ని అన్నారు. కానీ త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాలుగా సినిమాలు చేయాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత వాస్త‌వ రాజకీయాలు ఎలా ఉంటాయి? అన్న‌ది పూర్తిగా అర్ద‌మైంది. దీంతో ప‌వ‌న్ కాస్త స్వ‌రం మార్చిన‌ట్లు క‌నిపించింది.

ఆ నిర్మాణ సంస్థ‌తో ఒప్పందం:

ఏడాది కాలంలో ప‌వ‌న్ సినిమాల‌పై పాజిటివ్ గా మాట్లాడ‌టం గ‌మ‌నించ వ‌చ్చు. రాజ‌కీయం- సినిమా బ్యాలెన్స్ చేస్తాన‌ని..`ఓజీ` స‌మ‌యంలో? సుజిత్ లాంటి ద‌ర్శ‌కుడు ముందే త‌గిలి ఉంటే? అస‌లు రాజకీయాల్లోకే వ‌చ్చే వాడిని కాద‌న్నారు. మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ మ‌న‌సు రాజ‌కీయాల కంటే సినిమాలే ఎక్కువ‌గా కోరుకుం టుందా? అంటే ఆయ‌న వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి అలాగే భావించాలి. అంతేకాదు ప‌వ‌న్ మ‌ళ్లీ నిర్మాత‌గా బిజీ అవ్వాల‌ని ప్ర‌య‌త్నాల్లోనూ ఉన్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే పీపూల్స్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి `బ్రో` అనే సినిమాకు స‌హ నిర్మాత‌గా ప‌ని చేసారు.

సీరియ‌స్ గా సినిమాలే చేస్తారా:

సినిమాలో ప‌వ‌న్ నేరుగా డ‌బ్బు రూపంలో పెట్టుబడి పెట్ట‌క‌పోయినా? పారితోషికం ముందే తీసుకోకుండా ఓ గెస్ట్ రోల్ పోషించి వ‌చ్చిన లాభాల్లో కొంత షేర్ తీసుకున్నారు. ఇదే నిర్మాణ సంస్థ‌తో క‌లిసి ప‌వ‌న్ మ‌రిన్ని సినిమాలు నిర్మించే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు ఆయ‌న సన్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. రామ్ చ‌ర‌ణ్ తో ప‌వ‌న్ ఓ సినిమా నిర్మిస్తాన‌ని అభిమానుల‌కు ప్రామిస్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాను ఇదే సంస్థ‌తో క‌లిసి నిర్మించాల‌ని ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారుట‌. అలాగే పీపూల్స్ మీడియా ఫ్యాక్ట‌రీలో ప‌వ‌న్ హీరోగానూ సినిమాలు చేసే దిశ‌గా అడుగుల వేస్తున్నారుట‌. మొత్తంగా ప‌వ‌న్ మ‌న‌సు ఇప్పుడు సినిమాల వైపు సీరియ‌స్ గా మ‌ళ్లుతున్నట్లు ఈ స‌న్నివేశాలే చెబుతున్నాయి.