సినిమాలతో సమాజానికి ఎంతో మేలు! పవన్ కళ్యాణ్
సమాజంపై సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే? కచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ సినిమాలు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నది వాస్తవం.
By: Srikanth Kontham | 12 Sept 2025 5:20 PM ISTసమాజంపై సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే? కచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ సినిమాలు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నది వాస్తవం. అది మంచికి కావొచ్చు. .చెడుకు కావొచ్చు. కారణం ఏదైనా సమాజంపై సినిమా ప్రభావం ఉందని మేధావర్గం సైతం బలంగా ఏకీ భవిస్తుంది. సమాజంలో జరిగిన కొన్ని సం ఘటలనకు స్పూర్తినిచ్చేవి సినిమాలే అని పోలీసులు సైతం పలు కేసులు చేధించిన సంద ర్భంలో వెల్లడిస్తుంటారు. క్రైమ్ అంశాల విషయంలో పోలీసులు సినిమాల ప్రస్తావన తీసుకొస్తుంటారు.
ఆ సంగతి పక్కన బెడితే నేడు ఢిల్లీలో జరిగిన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో ఏపీ ఉప ముఖ్య మంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలను-లలిత కళలను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లలిత కళలు- సినిమాలు ప్రజలకు రిఫ్రెష్‌మెంట్‌లుగా పని చేస్తా యన్నారు. ఈ రెండు ప్రజలలో సానుకూల ఆలోచనా విధాన్ని సృష్టించడంలో సహాయపడతాయన్నారు. సినిమా-లలిత కళల రూపంలో వ్యక్తీకరణ లేకపోతే సమాజం హింస లో తీవ్రంగా పెరిగిపో తుందని అభిప్రాయపడ్డారు.
సమాజంలో సినిమాలు ఎంతో చైతన్యం తీసుకొస్తున్నాయన్నారు. అలాగే టాలీవుడ్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమాగా మారుతోందన్నారు. మార్కెట్ పరిది అంత కంతకు విస్తరించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎన్ ఎస్ డీ క్యాంపస్ చూస్తుంటే? మినీ ఇండియాను చూస్తున్నట్లు ఉందన్నారు. తనకు నటనలో శిక్షణనిచ్చిన గురువు సత్యానంద్ గారు ఎస్ ఎస్ డీ గురించి తరుచుగా చెప్పేవారన్నారు.
ఆ సమయంలోనే కళలు లేని సమాజంలో హింస పెరుగుతుందన్న విషయాన్ని ఆయనే చెప్పారన్నారు. కళారంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్ ఎస్ డీ క్యాంపస్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన ఉందని వెల్లడించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిగారితో చర్చిస్తానన్నారు. యువ కళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు, ఔత్సాహికులను, ప్రతిభావంతులను వెలికి తీసేందుకు ఇలాంటి సంస్థలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు.
