Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడిపోతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో జనసేన పార్టీ స్పందిస్తూ, వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి పవన్ హాజరైనట్లు వెల్లడించింది. వ్యక్తిగత విషయాలపై వార్తలు వస్తున్నా, ఆయన అధికారిక విధులు కొనసాగిస్తున్నారు. విడాకుల వార్తలపై పవన్ ఎప్పుడు స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   10 Nov 2026 3:25 PM IST
పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!
X

నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటున్నారు అన్న వార్త వచ్చిన దగ్గర నుంచి.. సోషల్ మీడియా మొత్తం ఈ వార్త గురించే నిండిపోయా. అన్నా లెజినోవాతో ఆయన విడిపోతున్నారనే వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకడంతో.. అందరూ దీనికి గల కారణం ఏమిటి అని సందేహ పడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ ఒక పోస్టు పెట్టింది. “గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులతో కలిసి పాల్గొన్నారు" అని పేర్కొంది.

దీంతో ప్రస్తుతం.. పవన్ కళ్యాణ్ పర్సనల్ సమస్యల్లో ఉన్నా కానీ.. రాజకీయాల పరంగా అయిన దాని ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటున్నారు అని కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంకా విడాకులు వార్త గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని ఆలోచిస్తున్నారు. మరి ఈ విషయంపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.