బ్రోనే పట్టించుకోలేదంటే.. బ్రో-2 కూడానా?
2019 ఎన్నికల కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీఎంట్రీ ఇచ్చాక వరుసబెట్టి రీమేక్‌లు చేసి అభిమానులను నిరాశకు గురి చేశాడు.
By: Garuda Media | 6 Nov 2025 9:37 PM IST2019 ఎన్నికల కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీఎంట్రీ ఇచ్చాక వరుసబెట్టి రీమేక్‌లు చేసి అభిమానులను నిరాశకు గురి చేశాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలే అయినా.. రీమేక్‌లు కావడం వల్ల అవి అనుకున్నంత మంచి ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఈ చిత్రాలను ముందు వ్యతిరేకించిన పవన్ ఫ్యాన్స్.. రిలీజ్ టైంకి అంతా పక్కన పెట్టి వాటిని బాగానే ఆదరించారు. కానీ బ్రో సినిమాకు వచ్చేసరికి వాళ్ల ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లిపోయింది ఇది కూడా రీమేకే. తమిళ మూవీ వినోదియ సిత్తం ఆధారంగా తెరకెక్కింది. అది మరీ గొప్ప సినిమా ఏమీ కాకపోవడం.. అందులో పెద్దగా హీరోయిజం లేకపోవడం, పవన్ పాత్ర గెస్ట్ రోల్ తరహాలో ఉండడంతో ఆ సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్సే పెద్దగా ఓన్ చేసుకోలేదు. మిగతా ప్రేక్షకులు కూడా దాన్ని అంతగా ఆదరించలేదు. బాక్పాఫీస్ దగ్గర ఆ మూవీ బిలో యావరేజ్‌గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫెయిల్యూరే. ఇలాంటి మూవీకి ఎవరైనా సీక్వెల్ ఆశిస్తారా? అనౌన్స్ చేసినా హర్షిస్తారా?
కానీ దర్శకుడు సముద్రఖని బ్రో సీక్వెల్ గురించి మాట్లాడ్డం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాను నటించిన కాంత సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సముద్రఖని.. బ్రో-2 గురించి అప్ డేట్ ఇచ్చి షాకిచ్చాడు. ఈ సినిమాకు స్క్రిప్టు రెడీగా ఉందని.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సినిమా పట్టాలెక్కుతుందని సముద్రఖని వ్యాఖ్యానించాడు. ఈ స్టేట్మెంట్ విని పవన్ ఫ్యాన్స్ వద్దుబాబోయ్ అని దండం పెట్టేస్తున్నారు. బ్రో సినిమానే తాము తట్టుకోలేకపోయామని.. దానికి ఇంకా సీక్వెలా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పవన్‌ను ఇంత సాఫ్ట్ రోల్స్‌లో తాము చూడలేమని.. ఇలాంటి క్లాసులు పీకే సినిమాలు వద్దే వద్దని వాళ్లు తేల్చేస్తున్నారు. అయినా ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ అసలు సినిమాలు చేస్తాడా అన్నదే అనుమానంగా ఉంది. ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తరచుగా ఏదో ఒక వార్త తెరపైకి వస్తోంది కానీ.. నిజంగా ఏదైనా సినిమా పట్టాలెక్కుతుందా అన్నది సందేహమే. కాబట్టి బ్రో లాంటి ఫెయిల్యూర్‌కు సీక్వెల్ చేసే అవకాశాలు తక్కువే.
