ఉస్తాద్ సెకండ్.. పవర్ స్టార్ స్వాగ్ మామూలుగా లేదుగా!
అయితే కంప్లీట్ సాంగ్ ను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది.
By: M Prashanth | 19 Feb 2026 6:59 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ అంటూ వచ్చిన ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ మెప్పిస్తోంది.
ప్రోమోలో పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైల్, స్వాగ్ క్లియర్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ ను ఎలివేట్ చేసేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బీట్స్ అదిరిపోయేలా ఉన్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. మరోసారి తన మార్క్ చూపిస్తూ హెవీ ఇన్స్ట్రుమెంట్స్ తో మాస్ ట్యూన్ కంపోజ్ చేశారు. చంద్రబోస్ రాసిన లిరిక్స్ ను ఎస్.పి. అభిషేక్ తో కలిసి డీఎస్పీ ఆలపించడం విశేషం.
అయితే కంప్లీట్ సాంగ్ ను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన దేఖ్లేంగే సాలా సాంగ్ భారీ రెస్పాన్స్ అందుకుంది. వింటేజ్ పవన్ స్టెప్స్, డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో కూడా అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. అదే సమయంలో ప్రోమో చూస్తుంటే సెకండ్ సాంగ్ థియేటర్లలో సెలబ్రేషన్ మూడ్ క్రియేట్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. పవన్- హరీశ్ శంకర్ కాంబోకు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు 10 ఇయర్స్ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటం విశేషం.
హీరోయిన్లుగా రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. విలన్ పాత్రలో తమిళ నటుడు పార్థిబన్ కనిపించనున్నారు. రాజకీయ నాయకుడి పాత్రలో ఆయన లుక్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది. హీరో- విలన్ మధ్య సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
అయితే అనేక వాయిదాల తర్వాత షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ స్పెషల్ గా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై హైప్ పెంచుతోంది. టీజర్, సాంగ్స్, పవన్ లుక్.. అన్నీ అభిమానుల్లో ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. అయితే ఫిబ్రవరి 22న రిలీజ్ కానున్న సెకండ్ సాంగ్ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
