Begin typing your search above and press return to search.

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 33 దేవ‌క‌ట్టాతోనా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 33వ చిత్రం లాక్ అయిందా? ఈ సారి ప‌వ‌న్ లో రియ‌ల్ సెన్సిబిలిటీస్ ను బ‌య‌ట‌కు తీయ‌బోతున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   22 March 2026 4:00 AM IST
పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 33 దేవ‌క‌ట్టాతోనా!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 33వ చిత్రం లాక్ అయిందా? ఈ సారి ప‌వ‌న్ లో రియ‌ల్ సెన్సిబిలిటీస్ ను బ‌య‌ట‌కు తీయ‌బోతున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. విలక్షణ చిత్రాల‌ దర్శకుడు దేవ కట్టాతో ప‌వ‌న్ ప‌ని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక చర్చలు ముగిశాయని స‌మాచారం. స్టోరీ డిస్క‌ష‌న్స్ కూడా ఓ కొలిక్కి వచ్చాయని ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. సామాజిక అంశాలను, రాజకీయ చైతన్యాన్ని తన సినిమాల్లో బలంగా చూపించే ద‌ర్శ‌కుడు దేవ కట్టా. ఇప్పుడ‌త‌డు పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడితో? జతకట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

దేవ కట్టా ఆలోచనా విధానం, ఆయన సినిమాల్లోని భావజాలం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. గతంలో దేవ కట్టా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమాపై పవన్ కళ్యాణ్ ఎంతో సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ చేసిన ప్రసంగం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే దేవ కట్టా శైలి పవన్‌కు బాగా నచ్చడంతో? వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే అది కేవలం వినోదం మాత్రమే కాకుండా ఒక బలమైన సామాజిక సందేశాన్ని ఇచ్చేలా ఉంటుందని అభిమానులు చాలా కాలంగా ఆశిస్తున్నారు.

దేవ కట్టా గత చిత్రాలు ప్రస్థానం, రిపబ్లిక్, ఆటోన‌గ‌ర్ సూర్య‌ వంటివి గమనిస్తే.. ఆయన పొలిటికల్ డ్రామాలను ఎంత ఇంటెన్స్‌గా తీస్తారో చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్‌ను దేవ కట్టా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి కూడా బలాన్నిచ్చేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ సైతం ఈ కథలోని లోతును మెచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌లేదు. రొటీన్ చిత్రంగానే తేలిపోయింది. గ‌త సినిమాల్లో ఓజీ హిట్ అవ్వ‌గా, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్లాప్ అయింది. దీంతో ప‌వ‌న్ కు మ‌ళ్లీ హిట్ కీల‌కంగా మారింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లు కాలేదు. త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంది. అయితే ఆ సినిమా షూటింగ్ తో ప‌ని లేకుండా దేవ‌క‌ట్టా తో త‌న 33వ చిత్రాన్ని ప‌వ‌న్ పట్టాలెక్కిస్తారు. కొంత కాలంగా ప‌వ‌న్ ఏక కాలంలో రెండు సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే.