సినిమాలకు పవన్ కళ్యాణ్ రెండేళ్ళు గ్యాప్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. అందుకే తను కమిటైన ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేశారు.
By: Ramesh Boddu | 19 Dec 2025 4:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. అందుకే తను కమిటైన ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేశారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ ఏ సినిమా చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతుంది. ఓజీ 2 ఉంటుందని వార్తలు ఊపు చేస్తున్నా సుజీత్ నానితో సినిమా చేసిన తర్వాతే అది ఉంటుందని తెలుస్తుంది.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు..
ఈలోగా పవన్ కళ్యాణ్ తో సినిమాకు మరికొంతమంది డైరెక్టర్స్ రెడీగా ఉన్నా కూడా ఆయన అందుకు రెడీగా లేరని టాక్. ఉస్తాద్ రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉండాలని చూస్తున్నారట. ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను చూసుకుంటున్న పవన్ కళ్యాణ్ సినిమాలు తన పనికి అడ్డు రాకూడదు అనుకుంటున్నారు. అందుకే ఇప్పటివరకు కమిటైన సినిమాలు పూర్తి చేసి నెక్స్ట్ సినిమాకు కాస్త టైం తీసుకునే ప్లాన్ లో ఉన్నారట.
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు 2, ఓజీ 2 ఈ రెండిటిలో ఏది ముందు చేస్తారు. ఓజీ అంటే సక్సెస్ అయ్యింది కాబట్టి ప్రీక్వెల్ లేదా సీక్వెల్ ఉంటుంది. కానీ వీరమల్లు 2 చేసే ఆలోచన ఉందా.. అంత సాహసం చేస్తారా లాంటి విషయాలకు క్లారిటీ రావాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల మీద తన బాధ్యతల మీద ఫోకస్ చేయనున్నారట. అందుకే ఏ కథ నచ్చినా.. ఏ డైరెక్టర్ వచ్చినా ఆఫ్టర్ 2 ఇయర్స్ అనేస్తున్నారట.
ఉస్తాద్ భగత్ సింగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్..
ఈలోగా ఓజీ 2 కథ రెడీ అవుతుంది.. సో ఉస్తాద్ తర్వాత అంటే 2028 లో అలా సుజీత్ మళ్లీ ఓజీ 2 చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సిందే. ఐతే ఈలోగా ఏదైనా షార్ట్ కథ.. స్పీడ్ గా చేసే ఛాన్స్ ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఓకే చెప్పే అవకాశం ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాల షెడ్యూల్ ఎలా ఉంటుందో చూడాలి.
ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేయాలనే కోరుతున్నారు. ఐతే ఓజీ లాంటి సినిమాలు ఒకటి చేసి కాస్త గ్యాప్ తీసుకున్నా ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. ఐతే ఉస్తాద్ తర్వాత ఓజీ 2 కచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుండగా నెక్స్ట్ స్టోరీస్ ఎలాంటివి చేయాలన్న ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ ఈ గ్యాప్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.
