మా వాళ్లను తీసుకుంటే మీకు పోయేదేంటి?
సిద్దార్ధ్ మల్హోత్రా-జాన్వీకపూర్ జంటగా తుషార్ జలోటా తెరకెక్కిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ `పరమ సుందరి`. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
By: Srikanth Kontham | 16 Aug 2025 1:22 AM ISTకేరళ నేపథ్యాన్ని తీసుకుని హీరోయిన్ గా హిందీ భామను తీసుకుంటారా? అని నిప్పులు చెరిగింది. జాన్వీకపూర్ స్థానంలో కేరళ నటిని తీసుకుంటే? ఆ పాత్ర ఇంకా బాగా పండేది కదా? అని మండిపడింది. 'మై తెక్క పాటిల్ దామోదరన్ సుందరం పిల్లై కేరళ సై'అంటూ జన్వీ చెప్పిన డైలాగును ప్రస్తావించి మేకర్స్ ను విమర్శించింది. ఇలాంటి పాత్రలకు మలయాళ నటుల్ని తీసుకుంటే తప్పే ముంది? మలయాళీ ట్యాలెంట్ మీకు సరిపోవడం లేదా? హిందీ నటులు మాత్ర మే మీరు రాసిన పాత్రలకు న్యాయం చేస్తున్నారా? ఇతర భాషల వాళ్లకు అవకాశాలు కల్పించరా? అని ఇదే తడవుగా కడిగేసింది.
'నాకు హిందీ కూడా తెలుసు. కేరళ వాసులైనంత మాత్రాన స్థానిక భాష మాత్రమే మాట్లాడుతాం? అనుకుంటారా? 90వ దశకంలో మలయాళ చిత్రాల్లో పంజాబీ పాత్రలో పోషించాలి అనుకున్నప్పుడు మేము కూడా స్థానిక నటుల్నే తీసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులొచ్చాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఆడుతున్నాయి. ఒకరి భాషను ఒకరు ఎంతో గౌరవించు కుంటున్నారు.
ఇలాంటి రోజుల్లో కూడా సొంత భాషలకు చెందిన వారికే అవకాశాలన్నీ కట్టబెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడింది. జాన్వీ అంటే తనకు ఎలాంటి ద్వేశం లేదని...తమ ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించాలనే అడుగుతు న్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాలీవుడ్ నటులు కొందరు గాయని వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు.
