పరమ్ సుందరి వివాదం.. జాన్వీ కపూర్ తో వ్యతిరేకతపై సింగర్ రియాక్షన్!
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు సౌత్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.
By: Madhu Reddy | 4 Sept 2025 12:41 PM ISTప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు సౌత్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులో రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' సినిమాలో చేస్తున్న ఈమె.. అటు బాలీవుడ్ లో కూడా పరమ్ సుందరి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రానికి.. తుషార్ జలోట దర్శకత్వం వహించారు. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయంతో దూసుకుపోతోంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడు.. బాలీవుడ్ కి చెందిన జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో మలయాళ యువతిగా చూపించడం పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేరళ బ్యాక్ డ్రాప్ చిత్రంలో వచ్చిన ఇందులో నటించడానికి మలయాళ హీరోయిన్స్ ఎవరూ లేరా అంటూ గాయని పవిత్ర మేనన్ కూడా ఒక వీడియో విడుదల చేయగా.. అప్పట్లో ఇది చాలా సంచలనంగా మారింది. దీంతో రోజు రోజుకి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా పవిత్ర మేనన్ దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
సింగర్ పవిత్ర మేనన్ మాట్లాడుతూ.. "నేను సింగర్ ను, నటిని కాదు.. గత కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ కి వ్యతిరేకంగా మలయాళ నటి విమర్శలు చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. నేను చెప్పింది పూర్తిగా విభిన్నం. ఆమెపై నాకు ఎలాంటి కోపం లేదు.. వృత్తిపరమైన అసూయ అంతకంటే కాదు.. నేను భాష గురించి మాత్రమే మాట్లాడాను. ఆమెను నేను వ్యక్తిగతంగా రెండుసార్లు కలిశాను. ఇండస్ట్రీలో ఏ ప్రాంతం నుంచైనా నటీనటులను ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఇతర ప్రాంతాల నుంచి నటీనటులను తీసుకునేటప్పుడు వారికి మన భాషను నేర్పించడానికి ట్రైనర్ ను కూడా నియమించుకోవాలి. అలా నియమించడం వల్ల నష్టం కూడా లేదు.. ముఖ్యంగా నాకు జాన్వీతో ఎలాంటి విభేదాలు లేవు. ఆమె నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు" అంటూ వివాదం పై స్పందించి క్లారిటీ ఇచ్చింది పవిత్ర మేనన్.
ఇకపోతే గతంలో ఈ వివాదం పై జాన్వీ కపూర్ కూడా స్పందించింది." నేను మలయాళ అమ్మాయిని కాదు.. మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు. కానీ కేరళ సంస్కృతి పై ఎప్పుడు నేను ఆసక్తి చూపిస్తూనే ఉంటాను. పరమ్ సుందరిలో నేను మలయాళ అమ్మాయి గానే కాదు తమిళ్ అమ్మాయి గా కూడా కనిపిస్తాను" అంటూ స్పందించింది జాన్వీ కపూర్.
ఇక అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. పరమ్ సుందరి నుండి ట్రైలర్ విడుదల చేసినప్పుడు పవిత్ర మేనన్ అసహనం వ్యక్తం చేస్తూ మలయాళంలో నటించడానికి నటీనటులే లేరా? ఒక హిందీ అమ్మాయిని ఇందులో పెట్టారు? అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇంస్టాగ్రామ్ కూడా ఈ వీడియోని డిలీట్ చేసింది. అప్పటినుంచి ఈ వివాదం ముదురుతూనే ఉండగా తాజాగా దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చింది పవిత్ర మేనన్ .
