ఈ హాలీవుడ్ దిగ్గజం అంటే పడి చచ్చే భారతీయ స్టార్లు!
హాలీవుడ్ లో ఒక గొప్ప శకం ముగిసింది. ఎక్స్-మెన్, స్టార్ ట్రెక్ వంటి చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దిగ్గజ నటుడు సర్ ప్యాట్రిక్ స్టీవర్ట్ (86) లాస్ ఏంజెల్స్‌లో కన్నుమూశారు.
By: Sivaji Kontham | 30 Oct 2026 8:34 PM ISTహాలీవుడ్ లో ఒక గొప్ప శకం ముగిసింది. ఎక్స్-మెన్, స్టార్ ట్రెక్ వంటి చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దిగ్గజ నటుడు సర్ ప్యాట్రిక్ స్టీవర్ట్ (86) లాస్ ఏంజెల్స్‌లో కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా విస్తరించిన ఆయన నటనా ప్రస్థానంలో క్లాసికల్ థియేటర్ నటుడి నుండి ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే సైన్స్ ఫిక్షన్ ఐకాన్‌గా ఎదిగారు. అల్జీమర్స్, లూయి బోడీ డిమెంటియాతో కొంతకాలం పోరాడిన ఆయన.. తన కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు.
ప్యాట్రిక్ స్టీవర్ట్ అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు ప్రధానంగా రెండు చిరస్మరణీయ పాత్రల చుట్టూ తిరుగుతాయి. `స్టార్ ట్రెక్`లో కెప్టెన్ జీన్-లుక్ పికార్డ్ ...`ఎక్స్-మెన్` సిరీస్‌లో ప్రొఫెసర్ ఛార్లెస్ జేవియర్. ఆయన గంభీరమైన స్వరం, తీక్షణమైన చూపు, నటనలో చూపించే మేధోసంపత్తి ఆ పాత్రలకు ప్రాణం పోశాయి. విశ్వాంతరాళంలో నౌకను నడిపే కెప్టెన్‌గా అయినా.. మ్యుటెంట్లకు మార్గదర్శనం చేసే ప్రొఫెసర్‌గా అయినా.., ప్రతీ పాత్రలోనూ ఆయన చూపించే మానవీయ కోణం ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తాయి.
బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఎంతటి ఘనవిజయం సాధించినా.. నాటక రంగంతో ఆయనకున్న అనుబంధం ఎప్పటికీ విడిపోలేదు. రాయల్ షేక్స్పియర్ కంపెనీతో ఆయనకు దశాబ్దాల కాలంగా ఉన్న బంధం ద్వారా హ్యామ్లెట్, మెక్బెత్, ది టెంపెస్ట్ వంటి ఎన్నో ప్రసిద్ధ షేక్స్పియర్ నాటకాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ సూపర్ స్టార్‌గా మారిన తర్వాత కూడా ఆయన మళ్లీ మళ్లీ నాటకరంగ వేదికపైకి రావడం.. నటన పై అతడికి ఉన్న అంకితభావానికి నిదర్శనం.
స్టీవర్ట్ మరణవార్త విన్న వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు అశ్రునయనాలతో నివాళులు అర్పించారు. `ఎక్స్-మెన్` లో ఆయనతో సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన హ్యూ జాక్మన్ ఆయన్ను ఒక గొప్ప మార్గదర్శకుడిగా, మిత్రుడిగా గుర్తుచేసుకోగా, `స్టార్ ట్రెక్` నటుడు విలియమ్ షాట్నర్ ఆయన తెచ్చిన గాంభీర్యాన్ని, మానవత్వాన్ని కొనియాడారు. కేవలం నటుడిగానే కాకుండా.. నిజజీవితంలో అతడు చూపించే హాస్యచతురత, దయాగుణం ఆయన్ను అందరికీ దగ్గర చేశాయి.
సర్ ప్యాట్రిక్ స్టీవర్ట్ భౌతికంగా మనకు దూరమైనా.. ఆయన వదిలివెళ్లిన కళా వారసత్వం సినీ -నాటక రంగ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆయన వెనక భార్య సన్నీ ఓజెల్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. `ఎంటర్ప్రైజ్` స్టార్ షిప్ బ్రిడ్జ్ నుంచి జేవియర్ ఇనిస్టిట్యూట్ హాల్స్ వరకు ఆయన పోషించిన పాత్రలు కేవలం సినిమాలు మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల నటీనటులకు, కథకులకు ఎల్లప్పుడూ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయి.
అభిమానులు - కలిసి పనిచేసిన నటీనటులు:
భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రయోగాత్మక నటుడు కమల్ హాసన్ ప్రపంచవ్యాప్త హాలీవుడ్ క్లాసిక్స్ - షేక్స్పియర్ నాటకాలను ఎంతో ఆరాధిస్తారు. ప్యాట్రిక్ స్టీవర్ట్ వాయిస్ మోడ్యులేషన్, థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ .. ప్రొఫెసర్ జేవియర్ పాత్రలోని గాంభీర్యాన్ని కమల్ హాసన్ పలు ఇంటర్వ్యూల సందర్భాలలో ప్రశంసించారు. లండన్ - బ్రిటీష్ థియేటర్ నేపథ్యం ఉన్న భారతీయ నాటకరంగ నటులు సర్ ప్యాట్రిక్ స్టీవర్ట్ నాటకాలను ఒక కేస్ స్టడీగా భావిస్తారు.
భారతీయ యంగ్ యాక్టర్లు ఫ్యాన్స్:
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రస్తుతం ఉన్న యంగ్ తరం హీరోలు (రానా దగ్గుబాటి, విక్కీ కౌశల్ వంటి సైన్స్-ఫిక్షన్ - పాప్ కల్చర్ అభిమానులు) స్టీవర్ట్ పోషించిన ప్రొఫెసర్ X , కెప్టెన్ పికార్డ్ పాత్రల అభిమానులే.
భారతీయ నటీనటులతో నేరుగా ఆయన హాలీవుడ్ సినిమాల్లో కలిసి నటించకపోయినా.. ఆయన లండన్, యూకే - అంతర్జాతీయ రంగానికి చెందిన చాలా మంది ఆసియన్ నాటకరంగ నటులతో కలిసి స్టేజ్ షోలలో పాల్గొన్నారు. ఆయన చూపిన విశ్వజనీన నటనా శైలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ నటీనటులకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.
