కళ్లలోనే దాగి ఉంది గ్రీకు దేవత
అందమైన కళ్లు టీనేజీ వైబ్స్ తో ఈ బ్యూటీ ఇప్పటికే కుర్రకారు మనసులపై పష్మినా రోషన్ బలమైన ముద్ర వేసింది.
By: Sivaji Kontham | 18 Nov 2025 9:42 AM ISTఆరడుగులు పైగా ఎత్తు.. అందమైన కళ్లు.. ఫిట్ లుక్‌తో గ్రీకువీరుడిగా మగువల గుండెల్లో నిలిచి ఉన్నాడు హృతిక్ రోషన్. అమ్మాయిలు అతడిని కలల రాకుమారుడిగా భావిస్తారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి ఒక నటి చిత్రసీమలో వెలుగులు విరజిమ్మేందుకు బరిలో దిగింది. పేరు పష్మినా రోషన్. ఈ బ్యూటీ 'ఇష్క్ విష్క్ రీబౌండ్' అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టి, ఇప్పుడు దక్షిణాది చిత్రసీమపైనా మనసు పారేసుకుందని సమాచారం.
అందమైన కళ్లు టీనేజీ వైబ్స్ తో ఈ బ్యూటీ ఇప్పటికే కుర్రకారు మనసులపై పష్మినా రోషన్ బలమైన ముద్ర వేసింది. ఇటీవల కొన్ని నెలలుగా డ్రీమ్ బోయ్ కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు షికార్ చేసాయి. హృతిక్ రోషన్ కజిన్ పష్మినా రోషన్ తో కార్తీక్ బాగా చనువుగా ఉంటున్నాడని పుకార్లు వస్తున్నాయి. అయితే ఆ తర్వాత జాతీయ మీడియా కథనంలో ఈ జంట బ్రేకప్ అయిపోయిందని కూడా కథనాలు వచ్చాయి. పాపులర్ పోర్టల్ ప్రకారం.. కార్తీక్- పష్మినా గత 5-6 నెలలుగా కలిసి చాలా సమయం గడిపారు. కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. అయితే ఇద్దరి మధ్యా సింక్ కుదరలేదు. అందువల్ల విడిపోయారు.. అంటూ ఈటైమ్స్ పేర్కొంది.
పష్మినా రోషన్ తాజా ఫోటోషూట్ గుబులు రేపుతోంది. ఈ అందమైన సోగకళ్ల సుందరి బ్లాక్ ఔట్ ఫిట్ లో అగ్గి రాజేస్తోంది. పష్మినా బ్లాక్ ఫ్రాక్ లో స్ట్రైకింగ్ ఫోజులతో కట్టి పడేసింది. ఒక అద్దంలో తన యవ్వనాన్ని తనివితీరా చూసుకుంటున్న పష్మినా, కుర్రకారు మనసులపై ఘాడమైన ముద్ర వేస్తోంది. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ వైరల్ గా దూసుకెళుతోంది. గ్రీక్ గాడెస్! అంటూ ఈ భామకు కితాబిచ్చేస్తున్నారు.
పష్మినా ఎవరు?
పష్మీనా రోషన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని దిగ్గజ సినీ కుటుంబం నుండి వచ్చారు. ఒక రకంగా నేపో కిడ్ అని పిలవాలి. ప్రఖ్యాత సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ -కాంచన్ రోషన్ ల కుమార్తె. 1970ల నుండి బాలీవుడ్ లో సంగీత దిగ్గజంగా పాపులరైన రాజేష్ రోషన్, ప్రముఖ సంగీత స్వరకర్త రోషన్ లాల్ నాగ్రత్ కుమారుడు. సినిమా సంగీతం, కళా రంగంతో సంబంధం ఉన్న రోషన్ కుటుంబంలో పష్మినా రోషన్ మూడవ తరం అమ్మాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తనకు కజిన్. హృతిక్ ప్రముఖ దర్శకనిర్మాత రాకేష్ రోషన్ కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఈ కుటుంబం నుంచి మరికొందరు సినీరంగంలో రాణిస్తున్నారు.
