Begin typing your search above and press return to search.

బేబీ బంప్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న పార్వతీ మెల్టన్..

పార్వతి మెల్టన్ కి 2012లో వివాహం జరిగింది. అమెరికాలో స్థిరపడిన ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకి పెళ్లయిన చాలా సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు.

By:  Madhu Reddy   |   26 Sept 2025 4:00 PM IST
బేబీ బంప్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న పార్వతీ మెల్టన్..
X

వెన్నెల మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పార్వతి మెల్టన్ జల్సా మూవీతో పేరు తెచ్చుకుంది.. ఎందుకంటే కొంతమంది హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. అలా పార్వతి మెల్టన్ కి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన జల్సా మూవీ తో గుర్తింపు లభించింది. వెన్నెల మూవీ తర్వాత గేమ్, అల్లరే అల్లరి,మధుమాసం వంటి సినిమాల్లో చేసింది. ఆ తర్వాత చేసిన జల్సా మూవీ ఈ హీరోయిన్ కి పేరు తెచ్చి పెట్టినప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు మాత్రం రాలేదు. ఎందుకంటే జల్సా మూవీలో మెయిన్ హీరోయిన్ గా ఇలియానా నటించగా..సెకండ్ హీరోయిన్ గా పార్వతి మెల్టన్ కనిపించింది. అందుకే ఈ హీరోయిన్ కి సైడ్ రోల్స్ తప్ప మెయిన్ హీరోయిన్ అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మహేష్ బాబు దూకుడు, బాలకృష్ణ శ్రీమన్నారాయణ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి అదరగొట్టేసింది.

ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన 13 ఏళ్లకు తల్లి కాబోతున్నాను అనే గుడ్ న్యూస్ ని ఈ మధ్యనే అభిమానులతో పంచుకుంది.. పార్వతి మెల్టన్ కి 2012లో వివాహం జరిగింది. అమెరికాలో స్థిరపడిన ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకి పెళ్లయిన చాలా సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. దాంతో పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్నాను అనే ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. అలా చాలా సంవత్సరాలు పిల్లల కోసం వెయిట్ చేసిన పార్వతి మెల్టన్ ఫైనల్ గా 2025లో ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆమెలో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు.

ప్రెగ్నెంట్ అయ్యాక చాలామంది బేబీ బంప్ కు సంబంధించి మెటర్నటీ ఫోటోషూట్ ని చేయించుకోవడం ఈమధ్య ట్రెండ్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.అలా ఈ హీరోయిన్ కూడా తన బేబీ బంప్ ఫోటోలను తీయించుకుంటూ తెగ సంబరపడిపోతుంది. ఈ మధ్యనే బేబీ బంప్ ఫోటోషూట్ చేయించుకున్న పార్వతి మెల్టన్ తాజాగా మరోసారి బంప్ తో ఉన్న ఫోటో షూట్ చేయించుకుంది... వైట్ కలర్ డ్రెస్ లో పార్వతి మెల్టన్ బేబీ బంప్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కి సంబంధించిన బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోస్ లో అచ్చం దేవకన్య లాగే ఉంది. అసలు తల్లి అవుతున్న కూడా ఈ హీరోయిన్ లో ఉన్న హాట్ నెస్ కొంచెం కూడా తగ్గలేదని ఫోటోస్ చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సినిమాలు మానేసి అమెరికాలో సెటిల్ అయిన పార్వతి మెల్టన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఇండస్ట్రీలో ఎంతో బాగా రాణిస్తున్న తనకి ఓ ఇద్దరు డైరెక్టర్ ల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఆ డైరెక్టర్ల వల్లే తన సినీ కెరియర్ నాశనమైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే పార్వతి మెల్టన్ ఆ డైరెక్టర్ పేర్లను ఇంటర్వ్యూలో చెప్పకపోయినప్పటికీ ఈమె మాటలు విన్న చాలామంది నెటిజెన్లు కొంతమంది డైరెక్టర్ల పేర్లు వైరల్ చేస్తూ ఈ డైరెక్టర్ వల్లే పార్వతి మెల్టన్ సినీ కెరియర్ నాశనమైంది అని మాట్లాడుకున్నారు.. మరి పార్వతి మెల్టన్ బిడ్డ పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రి ఇస్తుందా అనేది చూడాలి.