బేబి బంప్‌తో షాకిచ్చిన పార్వతి మెల్టన్
పార్వతి కొంతకాలంగా తిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టాలని కలలు కంటోందని గుసగుస వినిపిస్తోంది. దీనికోసం నేటి జెన్ జెడ్ తో పోటీపడుతూ వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.
By: Sivaji Kontham | 2 Sept 2025 12:30 AM ISTవెన్నెల - జల్సా లాంటి చిత్రాలతో పార్వతి మెల్టన్ ప్రతిభ తెలుగు వారికి తెలుసు. టాలీవుడ్ లో రేర్ ట్యాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ దురదృష్టవశాత్తూ, షార్ట్ స్పాన్‌లో పార్వతి తెలుగు చిత్రసీమ నుంచి ఎగ్జిట్ అవ్వడం ఆశ్చర్యపరిచింది.
కెరీర్ లో కొన్ని అంతగా ఆడని సినిమాలు ఉన్నాయి. గేమ్, అల్లరే అల్లరి, మధుమాసం ఆశించినంగా బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. అయినా పవన్ కల్యాణ్ లాంటి అగ్ర హీరో సరసన జల్సా లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినా పార్వతికి పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యపరిచింది. దూకుడులో ఐటమ్ నంబర్ చేసినా అదేమీ కెరీర్ కి కలిసి రాలేదు.
పార్వతి కొంతకాలంగా తిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టాలని కలలు కంటోందని గుసగుస వినిపిస్తోంది. దీనికోసం నేటి జెన్ జెడ్ తో పోటీపడుతూ వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. పార్వతి వరుస చూస్తుంటే, ఏడాది కాలంగా గోథిక్ తరహా డార్క్ ఫోటోషూట్లతో ఆశ్చర్యపరుస్తోంది. శరీరం అంతా నీలి రంగు డిజైన్లతో తనలోని కొత్త షేడ్ ని ఆవిష్కరిస్తోంది. రెండు రోజుల క్రితం పార్వతి షేర్ చేసిన ఫోటోలు పరిశీలిస్తే షాక్ తినకుండా ఉండలేం. ఈ ఫోటోగ్రాఫ్స్ లో పార్వతి ఒక ఫ్రెగ్నెంట్ ఉమెన్ ని ఇమ్మిటేట్ చేస్తున్నట్టు కనిపించింది. తన పొట్ట ఉబ్బి కనిపించడం నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇది ఫోటోగ్రఫిక్ జిమ్మిక్కా నిజమైనదేనా? అంటూ అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లోను ఇది స్పష్ఠంగా కనిపిస్తోంది. ఈ ఫోటోగ్రాఫ్ తో అనుబంధంగా రాసిన క్యాప్షన్ కూడా ఆశ్చర్యపరిచింది. ఈ క్యాప్షన్ ప్రకారం... `కొండలు, పువ్వులు, గాలి... అన్నీ నేను మోసే నా చిన్న హృదయ స్పందనతో సమయాన్ని నిలుపుకుంటాయి...! అని నర్మగర్భంగా రాసింది. ``నేను మోసే నా చిన్న హృదయ స్పందన.. నా కొత్త ప్రయాణాన్ని అనుసరించండి` అంటూ దేని గురించి పార్వతి ప్రస్థావించింది? అనేది సస్పెన్స్ గా ఉంది.
