Begin typing your search above and press return to search.

కెరీర్ పోయినా తలవంచకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా!

2017లో ‘కసబా’ సినిమా వ్యాఖ్యలతో ఎదురైన ట్రోలింగ్‌పై నటి పార్వతి తాజాగా స్పందించారు. ఆ విమర్శలు తనపై మాత్రమే కాదని, సినీ పరిశ్రమలోని పితృస్వామ్య ధోరణికి ప్రతిబింబమని అన్నారు. అత్యాచార, హత్య బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదని, ఆ కష్టకాలం తనను మరింత దృఢంగా మార్చిందని గుర్తుచేసుకున్నారు.

By:  Srikanth Kontham   |   23 Nov 2026 10:07 AM IST
కెరీర్ పోయినా  తలవంచకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా!
X

2017లో `కసబా` సినిమా సంభాషణలపై న‌టి పార్వతి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో మలయాళ ప‌రిశ్ర‌మ‌లో0 పెద్ద దుమారమే రేపాయి. మమ్ముట్టి లాంటి దిగ్గజ నటుడు మహిళలను కించపరిచే సన్నివేశంలో కనిపించడం నిరాశ కలిగించిందని పార్వ‌తి ఓ వేదికపై చే సిన వ్యాఖ్య‌లతో అమ్మ‌డు సోషల్ మీడియాకి టార్గెట్ అయింది.

పార్వ‌తి వ్యాఖ్య‌లు న‌చ్చ‌ని వారంతా ఇష్టానుసారం దుమ్మెత్తి పోసారు. తాజాగా ఓ స‌మావేశంలో ఆ చేదు రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ ట్రోలింగ్ వెనుక ఉన్న అసలు కోణాన్ని పార్వతి బయటపెట్టారు. ఆ విమ‌ర్శ‌లు పార్వ‌తి ఒక్క‌రి మీదే కాద‌ని సమాజంలో.. సినిమా రంగంలో ఎప్పటినుంచో పేరుకుపోయిన పితృస్వామ్య ధోరణిని బట్టబయలు చేయడానికి తానొక వాహకంగా మారానన్నారు.

వివాదం ముదిరినప్పుడు చుట్టూ ఉన్న చాలామంది దూరంగా జరిగారని.. ఆ ఒంటరితనం తనను ఎంతగానో కుంగదీసిందన్నారు. బెదిరింపులు, ఒత్తిళ్ల మధ్య తన ఆరోగ్యాన్ని, మనసును కాపాడుకోవడం ఎలాగో ఆ కష్టకాలమే నేర్పిందన్నారు. ఒక దశలో కెరీర్‌ను.. జీవితాన్ని లాక్కోవాలనుకున్నా సరే? పోరాడకుండా మాత్రం వెనుదిరగననే గట్టి నిర్ణయానికి వచ్చానన్నారు. `మీరు నా జీవితాన్ని.. కెరీర్‌ను తీసుకోవాలనుకుంటే తీసుకోండి. కానీ అంత సులభంగా తలవంచను` అనే ధైర్యం తనలో అప్పుడే మొద‌లైంద‌ని చెప్పుకొచ్చారు.

మాటల దాడికే పరిమితం కాకుండా అత్యాచార, హత్య బెదిరింపులు రావడంతో పార్వతి పోలీసులను ఆశ్రయించగా, ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప‌రిశ్ర‌మ‌లో మహిళల గౌరవం, భావ ప్రకటన స్వేచ్ఛపై పెద్ద చర్చకు తెరలేపిన ఆ ఘటన ఒక నటిగా తనను మరింత దృఢంగా మార్చిందని పార్వతి మాటల్లో కనిపించింది. వివాదాల సుడిగుండం నుంచి బయటపడి తన పనితోనే సమాధానం చెబుతున్న పార్వతి అనుభవాలు పరిశ్రమలో మారుతున్న వాతావరణానికి అద్దం పడుతున్నాయి.

ఇక పార్వ‌తి సినిమాల విష‌యానికి వ‌స్తే? ప్రస్తుతం `ఉల్లోళుక్కు`, `తంగలాన్`, `హెర్` వంటి చిత్రాల్లో న‌టిస్తున్నారు. అలాగే హృతిక్ రోషన్ నిర్మాణంలో తెరకె క్కుతోన్న `ది స్టార్మ్` సిరీస్‌లోనూ కనిపించనున్నారు. తెలుగు అవ‌కాశౄల కోసం అమ్మ‌డు సీరియ‌స్ గానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది గానీ ఇంత‌వ‌ర‌కూ ఆ ఛాన్స్ రాలేదు. మ‌రి కొత్త ఏడాదిలో సొగ‌స‌రికి అదృష్టం క‌లిసొస్తే తెలుగు సినిమాల‌కు క‌మిట్ అయ్యే ఛాన్స్ ఉంది.