Begin typing your search above and press return to search.

10 ల‌క్ష‌ల దొంగ‌త‌నం.. న‌టి త‌న ఉద్యోగుల‌పైనే ఫిర్యాదు

ప్రముఖ నటి, వ్యాపారవేత్త పారుల్ గులాటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

By:  Sivaji Kontham   |   4 July 2026 11:57 PM IST
10 ల‌క్ష‌ల దొంగ‌త‌నం.. న‌టి త‌న ఉద్యోగుల‌పైనే ఫిర్యాదు
X

ప్రముఖ నటి, వ్యాపారవేత్త పారుల్ గులాటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. `గర్ల్స్ హాస్టల్`, `మేడ్ ఇన్ హెవెన్ సీజ‌న్ 2` వంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లలో తన అద్భుతమైన నటనతో అందంతో లక్షలాది మంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాలేదు. `షార్క్ ట్యాంక్ ఇండియా` వంటి ప్రముఖ బిజినెస్ రియాలిటీ షో ద్వారా తన హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా పాపులర్ చేసి, ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

సెలబ్రిటీగా పారుల్ గులాటీకి ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం. ఈ భామ‌ సినిమా రంగంలో ఒక్కో ప్రాజెక్ట్‌కు సుమారు 60 లక్షల నుండి 80 లక్షల వరకు రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. కేవలం సినిమాలే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక్కో పోస్ట్‌ లేదా రీల్‌కు 5 లక్షల నుండి 8 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏదైనా ప్రముఖ బ్రాండ్ త‌న‌తో ఏడాది పాటు అగ్రిమెంట్ కుదుర్చుకుంటే బ్రాండ్ విలువను బట్టి 25 లక్షల నుండి 50 లక్షల వరకు వార్షిక ఎండార్స్‌మెంట్ ఫీజుగా అందుకుంటూ భారీగా ఆర్జిస్తున్నారు.

బెంగళూరు హెయిర్ సెలూన్ వివాదం:

ఇలాంటి క్రేజ్ ఉన్న పారుల్ గులాటీ ఇటీవల బెంగళూరులోని త‌న సొంత‌ హెయిర్ సెలూన్ ఉద్యోగులపై సంచలన నిందలు వేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి తీవ్ర వివాదానికి తెరలేపారు. ఆ సెలూన్‌లో తన బ్రాండ్‌కు సంబంధించిన దాదాపు 10 లక్షల విలువైన ఇన్వెంటరీ (స్టాక్) నష్టం జరిగిందని.. అక్కడ పనిచేసే ఉద్యోగులే స్కామ్ చేసి తనను దారుణంగా మోసం చేశారంటూ ఆ వీడియోలో ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున రచ్చకు దారితీసింది.

అయితే ఈ వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజ‌నుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సాధారణంగా 10 లక్షల రూపాయల దొంగతనం లేదా స్కామ్ జరిగితే ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు కానీ ఇలా సెలూన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అయితే న‌టి పారుల్ తాజా పోస్ట్ లో తాను ఈ విష‌య‌మై పోలీసుల‌కు ఫిర్యాదు చేసాన‌ని రోజంతా స్టేష‌న్ లోనే గ‌డిపాన‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ దొంగ‌త‌నం వ్య‌వ‌హారంపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

న‌టిగా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే పారుల్ త‌దుప‌రి ప‌లు వెబ్ సిరీస్ ల‌లో న‌టించేందుకు క‌థ‌లు వింటున్నార‌ని తెలుస్తోంది. అలాగే వెండితెర అవ‌కాశాల కోసం ప్ర‌స్తుతం వేచి చూస్తున్నారు. ఇంకా కొత్త ప్రాజెక్ట్ గురించిన వివ‌రాలు వెలువ‌డాల్సి ఉంది.