త్రిష.. సైలెంట్ గా ఉండడం బెటరా?
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష చుట్టూ జరుగుతున్న చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
By: M Prashanth | 9 March 2026 4:38 PM ISTకోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష చుట్టూ జరుగుతున్న చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరి గురించి వస్తున్న వార్తలు, వాటిపై వస్తున్న పొలిటికల్ కామెంట్స్, సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్స్.. ఇప్పుడు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష రెస్పాన్స్ పై కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఒక రాజకీయ నాయకుడు విజయ్, త్రిష గురించి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. ఆ కామెంట్స్ పై త్రిష రెస్పాండ్ అవుతూ.. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని రోజులుగా పలు వార్తలు బయటకు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ఆయన భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేశారని, దానికి ఒక నటి కారణమని ప్రచారం సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్, త్రిష కలిసి ఒక పబ్లిక్ ఈవెంట్ కు కలిసి హాజరవడం మరింత చర్చకు దారితీసింది. ఆ పరిణామాల తర్వాత తమిళ సినీ పరిశ్రమలో కొందరు నటులు ఆ విషయంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు.
కొందరు సరదాగా వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు జోకుల రూపంలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల నటుడు పార్తీబన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ చర్చను మళ్లీ వేడెక్కించాయి. కుందవై (పొన్నియన్ సెల్వన్ లో త్రిష పాత్ర పేరు) ఇంట్లోనే ఉండాలని, అప్పుడు ఎలాంటి సమస్యలు రావని అన్నారు. అయితే వాటిపై త్రిష సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది. త్రిష రెస్పాన్స్ తర్వాత ఆ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది.
కొందరు నెటిజన్లు త్రిష స్పందించడం సరైనదేనని భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఆమె మౌనం పాటించడం బెటర్ అని అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చిన వేళ.. ఇలాంటి వివాదాలు ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని చెప్పాలి. అందుకే త్రిష తరచుగా స్పందించడం కంటే కొంతకాలం మౌనం పాటిస్తే మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది.
మరోవైపు త్రిష అభిమానులు మాత్రం ఆమెపై వస్తున్న విమర్శలు అన్యాయమని అంటున్నారు. ఎవరు తప్పు చేసినా స్పందించే హక్కు ఆమెకు ఉందని వారు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం ఇప్పుడు ఎలాంటి వివాదాలపై కూడా స్పందించడం వల్ల మరింత చర్చ పెరుగుతుందని భావిస్తున్నారు. మొత్తానికి విజయ్- త్రిష చుట్టూ తిరుగుతున్న వివాదం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
