'జిమ్ జిమ్ తారా' సాంగ్ : 'పర్ణశాల' టీమ్ క్యాచీ లిరికల్ ప్రయోగం
భారీ స్టార్ కాస్టింగ్ లేదా టాప్ టెక్నీషియన్లు ఉంటేనే సినిమాకి బజ్ పెంచగలము అనుకోకూడదు.
By: Sivaji Kontham | 13 Oct 2026 10:23 PM ISTభారీ స్టార్ కాస్టింగ్ లేదా టాప్ టెక్నీషియన్లు ఉంటేనే సినిమాకి బజ్ పెంచగలము అనుకోకూడదు. ఒక్కోసారి అంతగా పాపులర్ కాని కాస్టింగ్ ఎంపికలు లేదా సాధారణ ప్రజలు పాడిన పాటలు కూడా జనంలోకి దూసుకెళతాయి. గొప్ప గాయనీమణులు అవసరం లేకుండా కొన్నిసార్లు ఒక క్యాచీ సాంగ్ .. సరైన సోషల్ మీడియా వ్యూహం ఉంటే చాలు.. సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి. హారర్ కామెడీ చిత్రం `పర్ణశాల`లోని `జిమ్ జిమ్ తారా` సాంగ్ ఈ ట్రెండ్‌కు ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా `పర్ణశాల` చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన `జిమ్ జిమ్ తారా` పూర్తి పాట సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తి వెర్షన్ విడుదల కాకముందే ఈ పాట తాలూకు చిన్న క్లిప్స్.. షార్ట్ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పలువురు నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు ఈ క్యాచీ ట్యూన్‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేయగా... కొందరు సెలబ్రిటీలు సైతం తమ కంటెంట్‌లో ఈ పాటను ఉపయోగించారు.
ఈ విధంగా ఎలాంటి భారీ ప్రమోషనల్ ఖర్చులు లేకుండానే సోషల్ మీడియాల ద్వారా ఈ పాట ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. ప్రజలకు ఒక పాట నచ్చితే దాన్ని తమ స్నేహితులు.. ఫాలోవర్లతో షేర్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్‌గా పాపులారిటీ పెరుగుతుందని ఈ పాట మరోసారి నిరూపించింది. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండానే సినిమాలకు వినూత్న రీతిలో ప్రమోషన్లు చేయవచ్చని ఈ చిత్రం నిరూపిస్తుందా లేదా చూడాలి.
`పర్ణశాల` చిత్రంలోని `జిమ్ జిమ్ తారా` పాటను జి. లక్ష్మీదేవి స్వయంగా రాసి ఆలపించడం విశేషం. లక్ష్మీ దేవి ప్రయత్నం కొత్తగానే ఉంది.. సహజంగాను ట్యూన్ ఉంది. సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ కి ఇది సహకరిస్తోంది. ఎస్‌ఎల్‌టి ఫిల్మ్స్ బ్యానర్‌పై మಂಚి వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రధానంగా హారర్ కామెడీ జోనర్‌తో పాటు సస్పెన్స్ త్రిల్లర్ అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చినా కేవలం ఒకే ఒక్క క్యాచీ సాంగ్‌తో `పర్ణశాల` సినిమా ఇండస్ట్రీలో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకోగలిగింది.
