Begin typing your search above and press return to search.

హీరోయిన్ ఆస్తి 74 కోట్లు - భర్త ఆస్తి కేవలం 50 లక్షలు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాఘవ్ చద్దా వివాహం జరిగినప్పటి నుండి ఈ జంట వార్తల్లో నిలుస్తూనే ఉంది.

By:  Sivaji Kontham   |   3 April 2026 8:00 AM IST
హీరోయిన్ ఆస్తి 74 కోట్లు - భర్త ఆస్తి కేవలం 50 లక్షలు!
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాఘవ్ చద్దా వివాహం జరిగినప్పటి నుండి ఈ జంట వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే తాజాగా వీరిద్దరి ఆస్తులకు సంబంధించిన వివరాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. నటన , రాజకీయాలు అనే రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఈ జంట ఆస్తుల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. పరిణీతి చోప్రా నికర ఆస్తి విలువ సుమారు రూ. 74 కోట్లుగా ఉంద‌ని అంచనా.

పరిణీతి చోప్రా తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో కేవలం నటిగానే కాకుండా ఒక బలమైన వ్యక్తిగత బ్రాండ్‌ను కూడా నిర్మించుకుంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో సుమారు రూ. 22 కోట్ల విలువైన విలాసవంతమైన సొంత‌ ఇల్లు ఉంది. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా.. ఖరీదైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. ఇందులో రూ. 1.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్, రూ. 43.19 లక్షల విలువైన ఆడి క్యూ4 , రూ. 69.27 లక్షల విలువైన ఆడి క్యూ7 వంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయి. గతంలో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో కూడా చోటు దక్కించుకుంది.

మరోవైపు పరిణీతి భర్త, ఎంపీ రాఘవ్ చద్దా ఆస్తి వివరాలు చూస్తే చాలా తక్కువగా కనిపిస్తాయి. ఆయన మొత్తం నికర ఆస్తి విలువ కేవలం రూ. 50 లక్షల లోపే ఉంటుందని క‌థ‌నాలొచ్చాయి. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు ఈ లెక్క‌లు చెబుతున్నాయి. రాఘవ్ చద్దాకు సుమారు రూ. 36 లక్షల విలువైన ఇల్లు ఉంది.. అత‌డు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారును వాడుతున్నట్లు సమాచారం. వీటితో పాటు అత‌డి వద్ద సుమారు రూ. 4.94 లక్షల విలువైన బంగారం, రూ. 6 లక్షల విలువైన బాండ్లు, షేర్లు ఉన్నాయి.

పరిణీతి- రాఘవ్ చద్దా ఆస్తులను కలిపి చూస్తే.. వీరిద్దరి మొత్తం నెట్ వర్త్ సుమారు రూ. 74.5 కోట్లుగా ఉంది. ఇందులో పరిణీతి వాటా అత్యధికంగా ఉండటం గమనార్హం. సినిమా గ్లామర్ ప్రపంచంలో భారీగా సంపాదించే నటీమణులకు.. ప్రజా సేవలో ఉండే రాజకీయ నాయకులకు మధ్య ఉండే ఆర్థిక వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా చూపుతున్నాయి. అయినా కానీ.. తమ మధ్య ఉన్న ఈ ఆర్థిక వ్యత్యాసాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఈ జంట ఎంతో అన్యోన్యంగా సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

మొత్తానికి ఒక టాప్ హీరోయిన్ ఆస్తి 74 కోట్లు కాగా, భర్త ఆస్తి కేవలం 50 లక్షలే ఉండటం సోషల్ మీడియాలో చర్చలకు దారితీస్తోంది. సెలబ్రిటీ ప్రపంచంలో ఆస్తుల కంటే అనుబంధాలకే ప్రాధాన్యత ఉంటుందని వీరిని చూస్తే అర్థమవుతుంది. పరిణీతి తన స్వయంకృషితో ఇంతటి ఆస్తిని సంపాదించగా.. రాఘవ్ చద్దా ఒక యువ రాజకీయ నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కలయిక `పవర్ కపుల్` అనే పదానికి కొత్త అర్థాన్ని ఇస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.