డబ్బు కోసం రాజీ పడని విలక్షణ నటుడు
మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన దృశ్యం ఫ్రాంఛైజీని హిందీలోను విజయవంతంగా నడిపిస్తున్నాడు అజయ్ దేవగన్.
By: Sivaji Kontham | 25 Oct 2025 11:46 AM ISTమలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన దృశ్యం ఫ్రాంఛైజీని హిందీలోను విజయవంతంగా నడిపిస్తున్నాడు అజయ్ దేవగన్. దృశ్యం, దృశ్యం 2 చిత్రాలను సొంత బ్యానర్ లో రీమేక్ చేసి బంపర్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు మలయాళంలో ఘనవిజయం సాధించిన `దృశ్యం 3` ని హిందీలోకి రీమేక్ చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారు దేవగన్.
అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదని ప్రకటించి ఆశ్చర్యపరిచారు సీనియర్ నటుడు పరేష్ రావల్. ఈ సినిమా స్క్రిప్టు అద్భుతంగా ఉంది. ఇంత మంచి సినిమాలో నా కోసం రాసిన పాత్ర నన్ను ఆకట్టుకోలేదు. అలాంటి పాత్రలో నటనకు ఆస్కారం ఉండదు.. అందుకే తప్పుకున్నానని నిజాయితీగా ప్రకటించారు పరేష్ రావల్.
తొలి రెండు భాగాలు ఘనవిజయం సాధించినందున హిందీలో `దృశ్యం 3`పైనా భారీ అంచనాలున్నాయి. అలాంటి సినిమాలో అవకాశాన్ని వదులుకోకూడదు.. కానీ నా పాత్రను వినగానే నాకు మజా రాలేదు! అందుకే తిరస్కరించాను! అని పరేష్ రావల్ తెలిపారు. నిజానికి కొందరు నటులు రాజీకి వచ్చి అలాంటి పెద్ద అవకాశాలను కాదనుకోరు... కానీ అందుకు భిన్నంగా తనకు కిక్ ఇవ్వని పాత్రలో నటించేందుకు నిరాకరించారు పరేష్ రావల్. ధనార్థనే ధ్యేయంగా ఆయన పాత్రలను ఎంచుకోరని ఇది నిరూపించింది.
అయితే పరేష్ రావల్ ఈ చిత్రంలో నటించలేనని ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అతడి నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసించారు. ``స్క్రిప్టు బావుంది.. ప్యాకేజీ బావుంది.. కానీ నా పాత్ర నన్ను ఆకట్టుకోలేదు!`` అని పరేష్ రావల్ నిజాయితీగా ప్రకటించడాన్ని చాలా మంది కీర్తించారు.
దశాబ్దాల కెరీర్‌లో పరేష్ రావల్ టచ్ చేయలేని జానర్ లేదు. కామెడీ, డ్రామా, యాక్షన్ సహా భిన్నమైన చిత్రాలలో తన అద్భుత నట ప్రదర్శనలతో పరేష్ ఆకట్టుకున్నారు. `హెరా ఫేరి` లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీలో బాబూరావు పాత్రతో అతడు ల్యాండ్ మార్క్ నటుడయ్యారు. కానీ `హేరాఫేరి 3` నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.
అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా అతడు తన వైఖరి విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్ఠంగా చెప్పాడు. రాజీ పడి ఎలాంటి పాత్రలోను నటించేది లేదని స్పష్ఠం చేసాడు. తన స్థాయికి తగ్గ పాత్రను ఆఫర్ చేస్తేనే అతడు దానికి అంగీకరిస్తున్నాడు.
