Begin typing your search above and press return to search.

అఖిల్ ని లైన్ లోకి తెస్తోన్న ప‌ర‌శురాం!

ఇటీవ‌లే లెనిన్ తో హిట్ అందుకున్న అఖిల్ త‌దుప‌రి చిత్రం విష‌యంలో అంత‌కు మించి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయితే పరశురామ్ చెప్పిన కథ ప‌ట్ల ఆస‌క్తిగా ఉన్నారు?

By:  Srikanth Kontham   |   30 July 2026 2:08 PM IST
అఖిల్ ని లైన్ లోకి తెస్తోన్న ప‌ర‌శురాం!
X

ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. `గీత గోవిందం` లాంటి అద్భుతమైన విజయం తర్వాత వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ తాజాగా అక్కినేని కాంపౌండ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొద్దికాలం క్రితం అక్కినేని నాగ చైతన్యకు పరశురామ్ ఓ సరికొత్త కథను వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల ఆ కాన్సెప్ట్ నాగ చైతన్యకు సెట్ కాలేదని, ఆ ప్రాజెక్ట్ అక్కడితోనే ఆగిపోయిందని ప్ర‌చారం జ‌రిగింది.

తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య వద్దకు వెళ్ళి సెట్ కాని ఆ క్రేజీ కథ ఇప్పుడు అఖిల్ అక్కినేని దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది. పరశురామ్ ఇటీవల అఖిల్‌ను కలిసి ఈ స్టోరీ వినిపించారట. అఖిల్ కూడా కథ పట్ల సానుకూలంగా స్పందించినట్లు ఫిలిం నగర్ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అఖిల్ బాడీ లాంగ్వేజ్‌కు, మాస్ అండ్ ఎనర్జిటిక్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా పరశురామ్ స్క్రిప్ట్‌ను మరింతగా మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇక్కడే విశ్లేషకులలో మ‌రో చర్చ కూడా నడుస్తోంది. నాగ చైతన్యకు వినిపించిన అదే పాత కథను అఖిల్ కు కొద్దిగా మార్చి చెబుతున్నారా? లేక అఖిల్ కోసం పరశురామ్ పూర్తిగా కొత్త కథను సిద్ధం చేశారా? అనే దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్‌కు పరశురామ్ లాంటి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల దర్శకుడు కథ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాజెక్ట్ పాత కథా లేక సరికొత్త కాన్సెప్టా అనేది త్వరలోనే అధికారికంగా తేలనుంది.

అఖిల్ అక్కినేని సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌లే లెనిన్ తో హిట్ అందుకున్న అఖిల్ త‌దుప‌రి చిత్రం విష‌యంలో అంత‌కు మించి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయితే పరశురామ్ చెప్పిన కథ ప‌ట్ల ఆస‌క్తిగా ఉన్నారు? అన్న‌ది సానుకూల అంశం. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోల క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేయడంలో, లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్‌ను బ్యాలెన్స్ చేయడంలో పరశురామ్ స్టైలే వేరు. ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే అఖిల్‌కు అదిరిపోయే కమర్షియల్ హిట్ పడటం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

`ది ఫ్యామిలీ స్టార్` త‌ర్వాత ప‌ర‌శురాం మ‌రో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌ని సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోలంతా బిజీగా ఉండ‌టంతో పాటు టైర్ - 2 హీరోలు కూడా వేర్వేరు క‌మిట్ మెంట్ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నారు. దీంతో హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కులు సైతం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప‌ర‌శురాం కి కూడా హీరో సెట్ అవ్వ‌లేదు. తాజాగా అఖిల్ షెడ్యూల్ చేసుకుని అత‌డిని సెట్ చేసే ప‌నిలో ప‌ర‌శురాం ప‌డిన‌ట్లు తెలుస్తోంది.అఖిల్ క్లాస్ ఇమేజ్ కు ప‌ర‌శురాం స్క్రిప్ట్ లు ప‌ర్పెక్ట్ గా సెట్ అవుతాయి.