శివ కార్తికేయన్ 'పరాశక్తి' ఎలా ఉంది..?
సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివ కార్తికేయన్, రవి మోహన్, అధర్వ, శ్రీలీల ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు.
By: Ramesh Boddu | 12 Jan 2026 9:32 AM ISTసంక్రాంతికి శివకార్తికేయన్ పరాశక్తి సినిమా వచ్చింది. తెలుగు వెర్షన్ ప్లాన్ చేయాలని అనుకున్నారు కానీ ఇక్కడ ఆల్రెడీ ఐదు సినిమాలు రిలీజ్ ఉన్న కారణంగా ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు. తెలుగు వెర్షన్ ఒక వారం ఆగి రిలీజ్ చేసే ప్లాన్ ఉందని తెలుస్తుంది. అసలైతే జనవరి 10న రిలీజ్ అవ్వాల్సిన పరాశక్తి కొన్ని ఇష్యూస్ వల్ల ఒకరోజు లేట్ గా రిలీజైంది. ఫైనల్ గా తమిళ ఆడియన్స్ ముందుకు పరాశక్తి వచ్చేసింది.
యాంటీ హిందీ ఇంపోజిషన్ నేపథ్యం..
సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివ కార్తికేయన్, రవి మోహన్, అధర్వ, శ్రీలీల ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే యాంటీ హిందీ ఇంపోజిషన్ నేపథ్యంతో రాసుకున్నారు సుధా కొంగర. చాలా సెన్సిటివ్ టాపిక్ అయిన ఈ ఇష్యూ ని 1960 లో ఎలా మొదలైంది అన్నది చూపిస్తూ సినిమా ఉంటుంది. ఐతే యాంటీ హిందీ ఇంపోజిషన్ నేపథ్యం తోనే స్టూడెంట్ లీడర్ అయిన శివ కార్తికేయన్ ఏం చేశాడు అన్నది సినిమా కథ.
క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ పరంగా అందరు బెస్ట్ ఇచ్చారు. కానీ ఏదైతే కథ, కథనాల్లో గ్రిప్ ఉండాలో దాన్నే డైరెక్టర్ సుధ కొంగర అంత స్ట్రాంగ్ గా చెప్పలేకపోయారు. చాలా చోట్ల ఆడియన్స్ కి బోర్ ఫీలింగ్ వచ్చేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒక సీరియస్ కథను చెప్పే ప్రయత్నంలో దాని స్క్రీన్ ప్లే చాలా ఫోకస్ తో చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది.
శివ కార్తికేయన్ తన క్యారెక్టర్ లో..
ఈ విషయంలో సుధ కొంగర ఇంకాస్త వర్క్ చేయాల్సింది. సినిమా ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ దాన్ని నడిపించిన తీరు ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండవు. అక్కడక్కడ సినిమాకు సపోర్ట్ చేస్తూ ఒకటి రెండు సీన్స్ పడినా లాభం లేకుండా పోయింది. సూరరై పోట్రు సినిమా తీసిన దర్శకురాలు సుధా కొంగర మరో సీరియస్ కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరే పరాశక్తి అంత ఇంపాక్ట్ చూపించలేదని అర్ధమవుతుంది.
శివ కార్తికేయన్ తన క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. రవి మోహన్ కెరీర్ లో ఫస్ట్ టైం విలన్ గా మెప్పించాడు. శ్రీలీల ఎప్పటిలానే ఆకట్టుకుంది. అధర్వ మిగతా కాస్టింగ్ వాళ్ల పరిధి మేరకు అలరించారు. కానీ సినిమా కథ, కథనం స్లో నరేషన్ వల్ల ఆడియన్స్ సినిమా చూసి పెదవి విరిచేస్తున్నారు.
సంక్రాంతికి వస్తుందనుకున్న దళపతి విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగిపోగా పరాశక్తి సోలో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే శివ కార్తికేయన్ కెరీర్ లో మరో అమరన్ అయ్యేది కానీ పరాశక్తి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
