Begin typing your search above and press return to search.

సెన్సార్‌కి చాలా ముందే పంపాలి.. స్టార్ హీరో ఫియ‌ర్స్!

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్, శివ‌కార్తికేయ‌న్ న‌టించిన ప‌రాశ‌క్తి చిత్రాలు ఒక రోజు గ్యాప్ తో పోటాపోటీగా విడుల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   10 Jan 2026 10:49 AM IST
సెన్సార్‌కి చాలా ముందే పంపాలి.. స్టార్ హీరో ఫియ‌ర్స్!
X

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్, శివ‌కార్తికేయ‌న్ న‌టించిన ప‌రాశ‌క్తి చిత్రాలు ఒక రోజు గ్యాప్ తో పోటాపోటీగా విడుల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈరోజు విడుద‌ల కావాల్సిన `జ‌న‌నాయ‌గ‌న్` సెన్సార్ డిలే కార‌ణంగా వాయిదాప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో చాలా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న కొన‌సాగుతోంది.

ఈ సమ‌యంలో శివకార్తికేయన్ `పరాశక్తి` జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతోంది. ఇది అత‌డి కెరీర్ మైలురాయి -25వ చిత్రం. దీంతో ఇది అత‌డికి అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ది. విజ‌య్ సినిమాతో పోటీప‌డే ఆలోచ‌న లేద‌ని చెప్పిన శివ‌కార్తికేయ‌న్ ఇది `అన్నదమ్ముల పొంగల్` అని, ప్రేక్షకులు రెండు సినిమాలు చూసి ఈ పండుగను జరుపుకోవాలని అన్నారు. ఇప్పుడు జ‌న‌నాయ‌గ‌న్ వాయిదా త‌ర్వాత మ‌రోసారి మీడియా స‌మావేశంలో శివ‌కార్తికేయ‌న్ మాట్లాడుతూ.. ఇది ఊహించ‌నిది. ఆ సినిమా వాయిదా పడుతుందని ఎవరూ అనుకోలేదు. ప్రేక్షకులు రెండు సినిమాలు చూడాలని నేను కోరుకున్నాను. గత 15 రోజులుగా చాలా ఊహించని పరిణామాలు జరిగాయి. మేము ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం.. అని అన్నారు.

జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతున్నా, మాకు ఇంకా సెన్సార్ స‌ర్టిఫికెట్ రాలేద‌ని తెలుసు. అయినా మా ప‌ని మేం చేసుకుంటూనే ఉన్నాము. నేను ఎవరితోనూ పోటీ పడటానికి ఇష్టపడను. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ చాలా చోటు ఉంది. నేను పోటీ పడాలనుకుంటే అథ్లెట్ లేదా బాక్సర్ అయ్యేవాడిని! అని అన్నారు. సోష‌ల్ మీడియాల్లో వ్య‌తిరేక క‌థ‌నాల‌ను తాను ప‌ట్టించుకోన‌ని అన్నాడు. వ్య‌క్తిగ‌తంగా తెలిసిన వారికి మాత్ర‌మే తాను జ‌వాబు దారీగా ఉంటాన‌ని తెలిపాడు. ఇటీవ‌ల‌ కుటుంబం, సన్నిహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నానని, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు. నేను సోషల్ మీడియాలోకి లాగిన్ అయితే అధ్యక్షుడు ట్రంప్‌ సహా అందరూ మమ్మల్ని విమర్శిస్తున్నట్లు అనిపిస్తుందని శివ‌కార్తికేయ‌న్ అన్నాడు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తో ముడిప‌డిన‌ వివాదాలపై మాట్లాడుతూ.. ఈసారి సినిమాల‌ను చాలా ముందే సెన్సార్ చేసుకోవాల‌ని కూడా అన్నారు. ప్రతి ఒక్కరికీ విభిన్న దృక్కోణాలు, వారి సొంత అభిప్రాయాలు ఉంటాయని అన్నారు. బహుశా మనం సినిమాలను సర్టిఫికేషన్ కోసం చాలా ముందుగానే పంపాలి! అని వ్యాఖ్యానించాడు.