Begin typing your search above and press return to search.

సుందరి భీగీ సారి కూడా ఓపెనింగ్స్ తెచ్చి పెట్టలేదు..!

జాన్వీ కపూర్‌ చాలా ఆశలు పెట్టుకుని హిందీలో చేసిన మరో మూవీ 'పరం సుందరి'. సిద్దార్థ్‌ మల్హోత్ర హీరోగా నటించిన ఈ సినిమాకు తుషార్‌ జలోటా దర్శకత్వం వహించాడు.

By:  Ramesh Palla   |   29 Aug 2025 1:02 PM IST
సుందరి భీగీ సారి కూడా ఓపెనింగ్స్ తెచ్చి పెట్టలేదు..!
X

జాన్వీ కపూర్‌ చాలా ఆశలు పెట్టుకుని హిందీలో చేసిన మరో మూవీ 'పరం సుందరి'. సిద్దార్థ్‌ మల్హోత్ర హీరోగా నటించిన ఈ సినిమాకు తుషార్‌ జలోటా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి బాలీవుడ్‌ ప్రేక్షకుల్లోనే కాకుండా సౌత్‌ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఎందుకంటే ఈ సినిమా సౌత్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కింది. ఎక్కువగా కేరళలో ఈ సినిమాను షూటింగ్‌ చేయడంతో పాటు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కావడం వల్ల పరమ్‌ సుందరి సినిమాను హిందీ ప్రేక్షకులతో పాటు సమానంగా సౌత్ ప్రేక్షకులు చూడాలి అనుకున్నారు. సినిమా నుంచి వచ్చిన ఒక్కొక్క అప్‌డేట్‌ సినిమాపై అంచనాలు మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు. కానీ చివరకు సినిమా ఓపెనింగ్స్ విషయంలో చాలా నిరుత్సాహంను చవి చూసింది.

బుక్ మై షో లో పరం సుందరి బుకింగ్స్‌

సాధారణంగా సౌత్‌ ఇండియాలో ముఖ్యంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఈ స్థాయి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యి, హైప్‌ వస్తే ఖచ్చితంగా పెద్ద హీరోల స్థాయిలో సినిమాలు ఓపెనింగ్‌ను దక్కించుకుంటాయి. కానీ పరమ్‌ సుందరి బాలీవుడ్‌లో అడ్వాన్స్ బుకింగ్‌ విషయంలో చాలా నిరాశను మిగిల్చింది. బుక్ మై షో ఇతర బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా దేశం మొత్తం మీద కనీసం 35 వేల టికెట్లు అమ్ముడు పోలేదు. ఇది బాలీవుడ్‌ ఇండస్ట్రీ పరిస్థితికి అద్దం పడుతోంది. మహావతార్‌ నరసింహా సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత కూడా వీకెండ్‌ లో లక్షకు పైగా టికెట్లు అమ్ముడు పోతున్నాయి. కానీ పరమ్‌ సుందరి కి మాత్రం పెద్దగా బుకింగ్‌ కావడం లేదు.

జాన్వీ కపూర్‌ పరం సుందరి షో

పరమ్‌ సుందరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి స్థాయి రివ్యూలు వచ్చిన తర్వాత, మౌత్‌ టాక్‌ను అనుసారం ముందు ముందు షో లు, రాబోయే రోజుల కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకు పరమ్‌ సుందరి ఓపెనింగ్స్ విషయంలో చాలా నిరుత్సాహపరిచింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. జాన్వీ కపూర్‌ అందం, సిద్దార్థ్‌ మల్హోత్ర యొక్క గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో పరమ్‌ సుందరి విడుదల రోజు వరకు ఖచ్చితంగా రూ.10 కోట్లకు మించి అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా రాబడుతుందని అంతా భావించారు. కానీ అనుకున్నది తలకిందులు అయింది, అడ్వాన్స్ బుకింగ్‌ మరీ ఇంత నీరసంగా ఉంటుందని ఊహించలేదని స్వయంగా బాక్సాఫీస్‌ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

భీగీ సారి పాటలో జాన్వీ అందాల ఆరబోత

ఈ సినిమాలోని భీగీ సారి పాట లో జాన్వీ కపూర్‌ చీర కట్టి రెయిన్ డాన్స్ చేసింది. ఈ మధ్య కాలంలో చీర కట్టులో తడిసిన అందాలతో డాన్స్ చేసిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సిద్దార్థ్‌, జాన్వీ కపూర్‌ల రెయిన్‌ డాన్స్, రొమాంటిక్ నెంబర్‌కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో సినిమా కి ఖచ్చితంగా పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అవుతుందని అంతా భావించారు. ఆ పాట విడుదల సమయంలో సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. దాన్ని చూసి ఖచ్చితంగా మినిమం ఓపెనింగ్స్ ను అంతా ఆశించారు. కానీ తీరా చూస్తే సినిమా ఓపెనింగ్స్ విషయంలో తీవ్రంగా నిరాశను చవిచూడాల్సి వచ్చింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ దక్కి, హిట్‌ వైపు దూసుకు పోయి, భారీ వసూళ్లను పరమ్‌ సుందరి దక్కించుకుంటుందేమో చూడాలి. జాన్వీ కపూర్‌ ఈ సినిమాతో అయినా బాలీవుడ్‌లో బ్రేక్ దక్కించుకుంటుందా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.