పరమ్ సుందరికి పాజిటివ్ బజ్...ఈ రొమాంటిక్ మూవీ పై పెరుగుతున్న అంచనాలు
బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ పరమ్ సుందరి సినిమా ఎక్కువ శాతం సౌత్ ఇండియాలో షూట్ చేశారు. అంతే కాకుండా కథ కూడా సౌత్ ఇండియాకు సంబంధించింది అనే వార్తలు వస్తున్నాయి.
By: Ramesh Palla | 31 July 2025 11:49 AM ISTబాలీవుడ్ సినిమాలు మళ్లీ గాడిన పడుతున్నట్లు అనిపిస్తుంది. ఇటీవలే యంగ్ స్టార్స్ నటించిన 'సయ్యారా' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. లాంగ్ రన్‌లో ఆ సినిమా ఏకంగా రూ.500 కోట్లను క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ముందు ముందు బాలీవుడ్‌లో మరిన్ని రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలు, రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అవి మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఆ క్రమంలోనే రాబోతున్న మరో రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ 'పరమ్ సుందరి'. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు. ఈ సినిమాను ఆగస్టు 29న భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పరదేశియా పాట వైరల్
బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ పరమ్ సుందరి సినిమా ఎక్కువ శాతం సౌత్ ఇండియాలో షూట్ చేశారు. అంతే కాకుండా కథ కూడా సౌత్ ఇండియాకు సంబంధించింది అనే వార్తలు వస్తున్నాయి. కనుక బాలీవుడ్‌లోనే కాకుండా ఈ సినిమాను సౌత్ భాషల్లోనూ విడుదల చేస్తే బాగుంటుంది అనే చర్చ నడుస్తోంది. ఇటీవల విడుదలైన పరదేశియా.. అనే పాటకు మంచి స్పందన వచ్చింది. చూడచక్కని విజువల్స్ తో పాటు హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ లుక్ ఆకట్టుకున్నాయి. సినిమాపై ఇప్పటికే ఉన్న పాజిటివ్ బజ్‌ను ఈ పాట ఖచ్చితంగా పెంచింది అనడంలో సందేహం లేదు. ఈపాటలో సిద్దార్థ్ మల్హోత్ర లుక్ గురించి ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రముఖంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సినిమా హైప్ పెరిగింది.
పరమ్ సుందరికి పాజిటివ్ బజ్
ఈ మధ్య కాలంలో సిద్దార్థ్ మల్హోత్ర సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది అని గతంలోనూ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు మరో మంచి కంటెంట్ ఓరియంటెడ్ రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీతో రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా దాదాపు నాలుగు వారాల సమయం ఉంది. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు. మరికొన్నాళ్లు ఇదే జోరును కొనసాగించగలిగితే ఖచ్చితంగా సినిమా మంచి ఓపెనింగ్స్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది మేటి చిత్రంగా నిలిచిన సయ్యారా సినిమా సరసన నిలవాలంటే మొదటి మూడు నాలుగు రోజుల్లో రూ.100 కోట్లకు మించి వసూళ్లు రాబట్టగలగాల్సి ఉంది. ఇదే స్థాయిలో సినిమాకు పాజిటివ్ బజ్ కొనసాగితే ఆ వసూళ్లు సాధించడం కష్టం ఏమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జాన్వీ కపూర్‌కి హిట్ పడేనా?
ఈ సినిమాను మొదట జులై 25, 2025న విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. సినిమా మేకింగ్ దశ నుంచి సిద్దార్థ్, జాన్వీ కపూర్‌ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. ఆ సమయంలోనే సినిమా గురించి చర్చ జరగడం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాపై ఆసక్తి పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు విడుదల ముందు మేకర్స్ నుంచి వస్తున్న అప్‌డేట్స్ కారణంగా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజా పాట విడుదల తర్వాత సినిమా మినిమం గ్యారెంటీ అంటూ చాలా మంది సినీ విశ్లేషకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూడ్డం కోసం ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ఈ సినిమాకు సచిన్-జిగర్ సౌండ్ ట్రాక్‌ను కంపోజ్ చేశారు. జాన్వీ కపూర్‌కి ఇది బాలీవుడ్‌లో మొదటి హిట్‌గా నిలుస్తుందా అనేది చూడాలి.
