Begin typing your search above and press return to search.

ఆసక్తిగా పరదా ట్రైలర్.. అనుపమ సాహస యాత్ర కథ ఇదే

అయితే అది తన గ్రామంలోని ఆచారంగా తెలుస్తుంది. ఈ పరదా వెనుక తాను ఆచరించే కారణాలు ఉంటాయి. ఎవరు ఎంత చెప్పినా ఆమె పరదా తీయదు.

By:  M Prashanth   |   9 Aug 2025 7:51 PM IST
ఆసక్తిగా పరదా ట్రైలర్.. అనుపమ సాహస యాత్ర కథ ఇదే
X

మలయాళ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను డైరెక్టర్ ప్రవీణ్‌ కండ్రేగుల సోషియో డ్రామా జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 22న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు హాజరై.. వీడియో రిలీజ్ చేశారు.

పల్లెటూరికి చెందిన సుబ్బు అనే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. సుబ్బు ఓ సాహస యాత్రకు వెళుతుంది. హిమాలయాల క్లిష్టమైన ప్రాంతాల్లో ఉన్న ఆలయాన్ని చేరుకోవడానికి చేసే సాహసాలు, పోరాటాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ క్రమంలో అనుపమ తమ తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి దర్శన, సంగీతతో ఒక టీమ్ గా ఏర్పరుస్తుంది. ఆమె మాత్రం ముఖాన్ని పరదా చాటునే దాచిపెట్టుకుంటుంది.

అయితే అది తన గ్రామంలోని ఆచారంగా తెలుస్తుంది. ఈ పరదా వెనుక తాను ఆచరించే కారణాలు ఉంటాయి. ఎవరు ఎంత చెప్పినా ఆమె పరదా తీయదు. అనుపమ ఆమె తన నమ్మకాలకు కట్టుబడి ఉంటుంది. ఆమె వెనుక ఆమె గ్రామం నేపథ్యమైన బలమైన కథ ఉంది. పల్లెటూరిలో ఆలయం, అమ్మవారు, ఊరి కోసం ఏదైనా చేసే జనం, సాంప్రదాయాలు, ఆచారాలు, మూఢనమ్మకాల చుట్టూనే కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

ట్రైలర్ చివరిలో గూస్ బంప్స్ వచ్చేలా అనుపమను కాళి దేవత రూపంలో చూపించారు. ఈ షాట్ అధ్భుతంగా వచ్చింది. సినిమా అంతా గ్రామీణ నేపథ్యం, సాహస యాత్ర చుట్టూనే తిరుగుతుంది. ట్రైలర్ లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. అనుపమ నటన నేచురల్ గా ఉంది. సాంకేతికంగానూ మూవీటీమ్ అదరగొట్టింది.

కాగా, ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించార. దర్శకుడు కొత్త కొత్త లొకేషన్లను సినమాలో చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్‌ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 22న తెలుగు, మలయాళం రెండింటిలోనూ విడుదల కానుంది.