Begin typing your search above and press return to search.

అనుపమ 'పరదా'.. ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందంటే?

అనుపమ డీగ్లామర్ రోల్ కనిపించి బ్యూటిఫుల్ గా ఉన్నారని చెబుతున్నారు. ప్యూర్ సోల్ గా అనిపించినట్లు అంటున్నారు.

By:  M Prashanth   |   21 Aug 2025 4:59 PM IST
అనుపమ పరదా.. ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందంటే?
X

మాలీవుడ్ బ్యూటీ, యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన మూవీ పరదా. మలయాళ నటి దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా బండి, శుభం ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. రాగ్ మయూర్, గౌతమ్ మీనన్, రాజేంద్ర ప్రసాద్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో రూపొందిన ఆ సినిమా శుక్రవారం (ఆగస్టు 22న) రిలీజ్ అవ్వనుండగా.. బుధవారం రాత్రి ప్రీమియర్ షోస్ వేశారు మేకర్స్. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా చూసిన వాళ్లు రివ్యూస్ ఇస్తున్నారు. మూవీపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?

అయితే పడతి అనే గ్రామంలో అమ్మాయిలు ఎందుకు పరదా ధరిస్తారో చెప్పే కథతో స్టార్ట్ అయిన మూవీ.. లాస్ట్ వరకు అలరించిందని సినీ ప్రియులు రివ్యూస్ ఇస్తున్నారు. పరదా తీస్తే ఆత్మాహుతి చేసుకోవడం అనే కఠినమైన నిబంధనను మహిళలపై పూర్వకాలంలో ఉన్న మూఢ నమ్మకాలను బలంగా గుర్తుకు తెస్తుందని అంటున్నారు.

ఆచారం, సంప్రదాయం కారణంగా మహిళలు ఎలా అణగారిపోయారో చెప్పే సినిమా ఇది అని కామెంట్లు పెడుతున్నారు. . అలాగే, మూఢ నమ్మకాలు మహిళలను ఎంత వెనక్కి తీసుకెళ్తాయో డైరెక్టర్ చక్కగా చూపించారని అంటున్నారు. అనేక సామాజిక అంశాలను చక్కగా ప్రస్తావించారని చెబుతున్నారు.

అనుపమ డీగ్లామర్ రోల్ కనిపించి బ్యూటిఫుల్ గా ఉన్నారని చెబుతున్నారు. ప్యూర్ సోల్ గా అనిపించినట్లు అంటున్నారు. ప్రవీణ్ కాండ్రేగుల నుంచి మరో కంటెంట్ మూవీ పరదా అని కామెంట్లు పెడుతున్నారు. చిన్న ప్రమాదం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో అదే సినిమా అని అంటున్నారు. సంగీత మంచి పాత్ర పోషించారని అంటున్నారు.

రాగ్ మయూర్ యాక్టింగ్ బాగుందని కామెంట్లు పెడుతున్నారు. ఓ ఊరి కోసం కథ ఉండగా, అందులో ఉండే పెద్ద మనుషులు బాగా నటించారని చెబుతున్నారు. అయితే ఎంతమంది యాక్టర్స్ ఉన్నా.. కంటెంట్ లేకపోతే ఎవరూ చూడరని.. కానీ ఇప్పుడు ప్రవీణ్ ఇప్పుడు అందరినీ లాస్ట్ వరకు క్యూరియాసిటీతో కూర్చోబెట్టారని అంటున్నారు.

మూవీలో చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. దర్శన, అనుపమ, సంగీత ముగ్గురూ ఉన్న సీన్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఆర్ట్ వర్క్ బ్యూటిఫుల్ గా ఉందని, కెమెరా వర్క్ సూపర్ అని చెబుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా సెట్ అయిందని కామెంట్లు పెడుతున్నారు. కొన్ని కామెడీ సీన్లు నవ్వించాయని, ఎమోషనల్ సీన్స్ క్లిక్ అయ్యాయని అంటున్నారు. అయితే 22వ తేదీ అంటే రేపు మన TUPAKI నుంచి రివ్యూ వస్తుంది. వెయిట్ చేయండి మరి.