Begin typing your search above and press return to search.

సల్మాన్‌కి వాళ్ల హింస మరీ ఎక్కువయ్యింది..!

ఫిల్మ్‌ సెలబ్రిటీలు బయట అడుగు పెడితే అభిమానుల నుంచి ఏ స్థాయిలో ఇబ్బంది ఉంటుందో చెప్పనక్కర్లేదు.

By:  Ramesh Palla   |   5 Sept 2026 11:00 PM IST
సల్మాన్‌కి వాళ్ల హింస మరీ ఎక్కువయ్యింది..!
X

ఫిల్మ్‌ సెలబ్రిటీలు బయట అడుగు పెడితే అభిమానుల నుంచి ఏ స్థాయిలో ఇబ్బంది ఉంటుందో చెప్పనక్కర్లేదు. సినిమా స్టార్స్‌ను చూసేందుకు జనాలు ఏ స్థాయిలో ఎగబడుతారో తెలిసిందే. ముఖ్యంగా స్టార్స్ ఎక్కడ ఉంటే జనాలు అక్కడ పెద్ద ఎత్తున ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ జనాలకు తోడు మీడియా పేరు చెప్పి ఫోటోగ్రాఫర్స్ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాపరాజీలు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. బయట ఎక్కడ కనిపించినా కూడా, వారి మూడ్‌ తో సంబంధం లేకుండా ఫోటోలకు ఫోజ్ ఇవ్వమంటూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందుకే గత కొన్నాళ్లుగా పలువురు సెలబ్రిటీలు పాపరాజీల విషయంలో అసహనం వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ సైతం ఈ విషయమై తీవ్రంగా స్పందించాడు.

సల్మాన్‌ ఖాన్‌ అసంతృప్తి....

బాలీవుడ్ సూపర్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తాజాగా తన సూపర్‌ హిట్‌ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్‌ 20 ని ప్రారంభించిన విషయం తెల్సిందే. ఆ షో కర్టన్‌ రైజ్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ న్యూ లుక్‌లో కనిపించాడు. కౌబాయ్ ఔట్‌ ఫిట్‌ కారణంగా సల్మాన్‌ ఖాన్‌ చాలా స్పెషల్‌గా కనిపించాడు అంటూ అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ సెట్‌ ముందు సల్మాన్‌ ఖాన్‌ ను పాపరాజీలు అడ్డుకుని ఫోటోలకు ఫోజ్ ఇవ్వాల్సిందిగా అడిగారు. ఆ సమయంలో పాపరాజీల నుంచి చాలా మంది బాబా బాబా.. అంటూ అరుస్తూ ఒక్క ఫోటోకు ఫోజ్‌ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేయడంతో పాటు, కొందరు డిమాండ్‌ చేసినట్లుగా అడిగారట. దాంతో సల్మాన్‌ ఖాన్‌ అసహనం వ్యక్తం చేశాడట. బాబా అని పిలిచిన సమయంలో సల్మాన్‌ ఖాన్‌ కాస్త కోపంగా అటు వైపు చూశాడు అంటూ కొందరు అక్కడ ఉన్న వారు సోషల్‌ మీడియా ద్వారా మాట్లాడారు.

పాపరాజీలపై సల్మాన్‌ ఖాన్‌ కోపం...

పాపరాజీలపై ఆ మధ్య ఒక హీరోయిన్‌ చాలా సీరియస్ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. పర్సనల్‌ లైఫ్‌ లోకి ఎందుకు వస్తున్నారు అంటూ ఆ సమయంలో ఆమె అసహనం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో తమను చూపించి డబ్బులు సంపాదిస్తున్నారు అంటూ కూడా కొందరు హీరోయిన్స్‌ పాపరాజీలపై ఆగ్రహం వ్యక్తం చేయడం మనం చూశాం. ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ సైతం అదే తరహాలో అసహనం వ్యక్తం చేయడంను బట్టి చూస్తూ ఉంటే పాపరాజీల యొక్క హింస ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద హీరోల వద్ద, హీరోయిన్స్ వద్ద దాదాపుగా వంద మంది గుమ్మిగూడుతూ ఉంటారు. ఒకేసారి అంత మంది మీద పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సల్మాన్‌ సైతం అదే హింసను ఫేస్ చేశాడు కనుక అసహనం వ్యక్తం చేశాడు అని కొందరు ఆయనకు మద్దతుగా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 20...

బిగ్‌బాస్‌ సీజన్‌ 20తో హిందీ ప్రేక్షకుల ముందుకు సల్మాన్‌ ఖాన్‌ వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే కర్టన్‌ రైజ్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తి అయిందని తెలుస్తోంది. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో ఒకటికి రెండు మూడు సార్లు జాగ్రత్తలు తీసుకున్నారని బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి సమాచారం అందుతోంది. గత సీజన్‌లతో పోల్చితే ఈ సీజన్‌ ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ బెంచ్ మార్క్‌ నెంబర్‌ సీజన్ కనుక సల్మాన్‌ సైతం చాలా ఎక్కువ శ్రద్ద పెడుతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి మరోసారి బిగ్‌బాస్‌ తో సల్మాన్‌ సందడి చేయబోతున్నాడు. అయితే ప్రతి వారం బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ కు ముందు సల్మాన్‌ ఖాన్‌ కి ఈ పాపరాజీల హింస తప్పక పోవచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్‌ కి ఉండే కోపం కారణంగా పాపరాజీలు ఇకపై అయినా కాస్త జాగ్రత్తగా ఉంటారేమో చూడాలి.