ప్రమోషన్ కోసమేనా హీరోయిన్లు ఇన్ని పాట్లు?
అయితే చాలా అరుదుగా అప్‌కమ్ హీరోయిన్లు లేదా కొత్తగా ఈ రంగంలో ప్రవేశించిన కథానాయికలకు మాత్రం ఫోకస్ అవసరం.
By: Sivaji Kontham | 27 Oct 2025 8:00 PM ISTఏదో ఒక సమయంలో ఎవరో హీరోయిన్ విమానాశ్రయం నుండి వస్తున్నారని ఫోటోగ్రాఫర్లు ఎలా తెలుసుకుంటారు?
రోజంతా ఎవరో ఒక హీరోయిన్ విమానాశ్రయం నుండి బయటకు వస్తుందని ఊహిస్తూ వారు వేచి ఉంటారని మీరు అనుకుంటున్నారా?
ఈ ప్రశ్నకు సమాధానం ఊహించగలిగేదే. ఫలానా హీరోయిన్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగుతోందని లేదా ముంబైకి తిరుగు ప్రయాణమైందని లేదా బెంగళూరు విమానాశ్రయంలో దిగుతోందనే సమాచారం ఫోటోగ్రాఫర్లకు ఉంటుంది. అయితే అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణ సమయంలో వెంటపడి విసిగించే ఫోటోగ్రాఫర్లపై కొందరు హీరోయిన్లు విరుచుకుపడుతుంటారు. జిమ్ లు, రెస్టారెంట్లు, గుడులు గోపురాల సందర్శనల్లో వెంటపడి మరీ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటే సమయం సందర్భం ఉండనక్కర్లేదా? అంటూ తప్పించుకుని వెళ్లే నాయికలు ఉన్నారు.
అయితే చాలా అరుదుగా అప్‌కమ్ హీరోయిన్లు లేదా కొత్తగా ఈ రంగంలో ప్రవేశించిన కథానాయికలకు మాత్రం ఫోకస్ అవసరం. గుర్తింపు కోసం ఫోటోగ్రాఫర్ల నుంచి ఫోటోషూట్ల సాయం కావాలి. కొత్త తరం భామలకు మీడియా సహకారం అవసరం గనుక దానికి పీఆర్ ఏర్పాటు ఉంటుంది. నవతరం భామలకు పబ్లిక్ లో హైప్ పెంచేందుకు ఈ ఏర్పాటు అవసరం.
కొన్నిసార్లు విమానాశ్రయాల్లో హీరోయిన్ ప్రయాణాన్ని ట్రాకింగ్ చేసే ఫోటోగ్రాఫర్లు అక్కడ గంటల తరబడి కాపు కాసుకుని కూచుంటారు. రోజంతా విమానాశ్రయంలో వెయిట్ చేయరు కానీ.. ముంబై ఫ్లైట్ వస్తోంది అంటే బాలీవుడ్ భామలు ఇక్కడ అడుగుపెట్టేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ సమయానికి ఫోటోగ్రాపర్లు చేరుకునే వీలుంటుంది. రేర్ గా ప్రమోషన్ కోరుకునే అప్ కమ్ హీరోయిన్ ల కోసం పీఆర్ లు ప్రయాణ షెడ్యూల్‌ని మీడియాకు లీక్ చేసే ఛాన్సుంటుంది.
సీనియర్ భామలు విమానాశ్రయంలో దిగగానే తమను వెంబడించి ఫోటోలు తీసే ఒక ఫోటోగ్రాఫర్ ఉండాలని కోరుకోరు.. ఫోటోగ్రాఫర్లు, పబ్లిక్ ఎంతగా వెంటపడితే అంతగా క్రేజ్ ఉన్నట్టే కానీ, విసిగించనంత వరకూ కొందరు దీనిని భరించగలరు. సమంత, తమన్నా లాంటి సీనియర్ నటీమణులకు ఇలాంటి ఫోటోషూట్ల కోసం వెంపర్లాడాల్సిన పని లేదు. జిమ్‌లు, పబ్‌లు, మార్కెట్ ప్లేస్ లలో ఫలానా సీనియర్ బ్యూటీ అవైలబిలిటీ ఉంది అంటే ఫోటో క్లిక్ ల కోసం పాపరాజీలు వెంటపడటం రెగ్యులర్ గా చూసేదే. బాలీవుడ్ లో కొందరు ప్రేమజంటలు ముసుగులు వేసుకుని మరీ విమానాశ్రయాల్లో మీడియాకు చిక్కకుండా దాగుడుమూతలు ఆడిన సందర్భాలను మర్చిపోకూడదు.
