Begin typing your search above and press return to search.

పంజా రీ రిలీజ్.. దర్శకుడికి మళ్లీ దారి చూపిస్తుందా?

ఇప్పుడు సెప్టెంబర్ 2న 4కే వెర్షన్‌లో సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుండగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు విష్ణువర్ధన్ పేరు చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగులో వినిపిస్తోంది.

By:  M Prashanth   |   1 Sept 2026 3:00 PM IST
పంజా రీ రిలీజ్.. దర్శకుడికి మళ్లీ దారి చూపిస్తుందా?
X

‘పంజా’ 2011లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాత్రం ఆ సినిమా మాయమైపోలేదు. పవన్ గడ్డం లుక్, జై పాత్ర, కొన్ని యాక్షన్ సీన్లు, యువన్ శంకర్ రాజా సంగీతం ఇప్పటికీ ఫ్యాన్స్ మాట్లాడుకునే అంశాలే. ఇప్పుడు సెప్టెంబర్ 2న 4కే వెర్షన్‌లో సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుండగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు విష్ణువర్ధన్ పేరు చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగులో వినిపిస్తోంది.

విష్ణువర్ధన్‌కు స్టైలిష్ యాక్షన్ సినిమాలు కొత్త కాదు. అజిత్‌తో ‘బిల్లా’, ‘ఆరంభం’ చేసిన అతను, హిందీలో ‘షేర్షా’తో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో ప్రెజెంటేషన్ విషయంలో స్పెషల్ స్టైల్ ఉంటుంది. అయినా గత కొన్నేళ్లుగా అతని కెరీర్‌లో పెద్ద స్టార్ సినిమా వరుసగా పడలేదు. 2025లో తమిళంలో తీసిన ‘నేసిప్పాయ’ కూడా ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. ఇక ఇప్పుడు అతని పేరు మళ్లీ పెద్ద హీరోల దగ్గర వినిపించాల్సిన టైమ్ వచ్చింది.

విష్ణువర్ధన్‌ అనుకుంటే వెంటనే కథలు వినే పెద్ద హీరోలు తెలుగులో ఉన్నారు. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న స్టార్లు. అయితే వాళ్లందరి చేతుల్లో ఇప్పటికే పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే దర్శకుడికి టాలెంట్ ఉండటం ఒక్కటే ఇక్కడ సరిపోదు. సరైన కథతో సరైన సమయంలో హీరో దగ్గరకు వెళ్లాలి. డేట్స్ దొరకాలి. నిర్మాత కూడా ఆ కాంబినేషన్‌పై నమ్మకం పెట్టాలి.

ఈ సమయంలో ‘పంజా’ రీ రిలీజ్ విష్ణువర్ధన్‌కు ఒక హెల్ప్ చేయవచ్చు. రీ రిలీజ్ ముందు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో పవన్‌తో మొదటి మీటింగ్, ఆయన లుక్, సినిమా తీసిన విధానం గురించి విష్ణువర్ధన్ మాట్లాడుతున్నారు. పదిహేనేళ్ల క్రితం చేసిన సినిమా గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడే అవకాశం రావడంతో దర్శకుడి పేరు కూడా మళ్లీ టాలీవుడ్ చర్చల్లోకి వస్తోంది.

‘షేర్షా’ తర్వాత విష్ణువర్ధన్ ఖాళీగా ఏమి లేడు. 2026లో ఓ హిందీ రాజకీయ థ్రిల్లర్ కోసం చర్చల్లో ఉన్నట్టు టాక్స్ వచ్చాయి. అంటే సమస్య పని లేకపోవడం కాదు. తెలుగులో మాత్రం ‘పంజా’ తర్వాత ఆయన మరో పెద్ద తెలుగు సినిమా చేయలేదు. ఇప్పుడు ఇక్కడి హీరోల మార్కెట్ అప్పటితో పోలిస్తే చాలా పెరిగింది. ఆ స్థాయికి సరిపోయే కథ ఉంటే ఇక్కడ మంచి అవకాశాలు అందుకోవచ్చు. రీ రిలీజ్ ఎంత బాగా ఆడినా అది కొత్త కాంబినేషన్‌కు టికెట్ కాదు. కానీ నిర్మాతలు, హీరోల టీమ్స్ ఒక దర్శకుడిని మళ్లీ గుర్తు చేసుకునేంత రేంజ్ తీసుకురాగలదు.