బాక్సాఫీస్ డే 1: వంద కోట్ల వీరులు.. ఏ హీరో ఖాతాలో ఎన్ని?
బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల వసూళ్లు సాధించడం ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ గా మారింది. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత మొదటి రోజే ఈ ఫీట్ అందుకోవడం స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాలెంజ్ గా మారింది.
By: M Prashanth | 10 Jan 2026 4:03 PM ISTబాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల వసూళ్లు సాధించడం ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ గా మారింది. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత మొదటి రోజే ఈ ఫీట్ అందుకోవడం స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాలెంజ్ గా మారింది. ఈమధ్య కాలంలో ప్రభాస్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పరుగుల వరద పారించారు. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల ఓపెనింగ్స్ అందుకోవడంలో ప్రభాస్ అందరికంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
బాహుబలి 2, సాహో వంటి సినిమాలతో మొదలైన ఈ ప్రస్థానం రీసెంట్ గా వచ్చిన రాజా సాబ్ వరకు ఆరు సార్లు రిపీట్ అయింది. ఈ మధ్య వచ్చిన ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ కూడా మొదటి రోజే వంద కోట్ల మార్కును సునాయాసంగా దాటేశాయి. ప్రభాస్ కి ఉన్న గ్లోబల్ మార్కెట్ వల్లే ఇది సాధ్యమవుతోందని ట్రేడ్ వర్గాల అంచనా.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో జవాన్, పఠాన్ సినిమాలతో మొదటి రోజే సెంచరీ కొట్టేశాడు. అటు కోలీవుడ్ స్టార్ విజయ్ కూడా లియో, గోట్ చిత్రాలతో తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నాడు. ఈ సినిమాలన్నీ కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా వివిధ భాషల్లో విడుదల కావడం ఈ స్థాయి వసూళ్లకు ప్రధాన కారణం. టాక్ మిక్స్డ్ గా ఉన్నా సరే క్రేజ్ తోనే ఈ కలెక్షన్లు రావడం విశేషం.
తెలుగు నుంచి ఎన్టీఆర్ దేవర సినిమాతో, అలాగే రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ తో ఈ ఘనత సాధించాడు. అల్లు అర్జున్ పుష్ప 2 తో ఈ జాబితాలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కన్నడ స్టార్ యశ్ కేజీఎఫ్ 2 తో, రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో మొదటి రోజే వంద కోట్ల క్లబ్బులో చేరిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ రీసెంట్ గా OGతో ఫస్ట్ టైమ్ సెంచరీ కొట్టాడు. రజినీకాంత్ జైలర్ తో తన సత్తా చాటారు.
నిజానికి బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయి వసూళ్లు రావడం వెనుక భారీ నిర్మాణ విలువలు, దర్శకుల విజన్ కూడా ఉంటాయి. ప్రస్తుతం రాజా సాబ్ కూడా మిక్స్డ్ టాక్ ఉన్నా మొదటి రోజే 103 కోట్ల గ్రాస్ సాధించి ఈ 100 కోట్ల గ్రూప్ లో చేరింది. కేవలం ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా లాంగ్ రన్ లో ఈ సినిమాలు ఎంతవరకు నిలబడతాయనేది ఆయా సినిమాల కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పటివరకు మొదటి రోజే వంద కోట్ల ఓపెనింగ్స్ సాధించిన హీరోల వివరాలు
ప్రభాస్ (6 సినిమాలు): బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ, ది రాజా సాబ్
షారుఖ్ ఖాన్ (2 సినిమాలు): పఠాన్, జవాన్
విజయ్ (2 సినిమాలు): లియో, గోట్
ఎన్టీఆర్ (1 సినిమా): దేవర
రామ్ చరణ్, ఎన్టీఆర్ (1 సినిమా): ఆర్ఆర్ఆర్
అల్లు అర్జున్ (1 సినిమా): పుష్ప 2
యశ్ (1 సినిమా): కేజీఎఫ్ 2
పవన్ కళ్యాణ్ (1 సినిమా): OG
రజినీకాంత్ (1 సినిమా): 2.ఓ
రణబీర్ కపూర్ (1 సినిమా): యానిమల్
