Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ డమ్ కు అసలు మీటర్ ఇదే.. ఆ కండిషన్ కూడా!

ప్రస్తుతం సౌత్ సినిమాలకు క్రేజ్ పెరిగిన తర్వాత హీరోల ఇమేజ్ కూడా మారిపోయింది. ఒకప్పుడు ఒక లాంగ్వేజ్ కు పరిమితమైన మార్కెట్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో పెరిగింది.

By:  M Prashanth   |   10 Sept 2026 11:47 AM IST
పాన్ ఇండియా స్టార్ డమ్ కు అసలు మీటర్ ఇదే.. ఆ కండిషన్ కూడా!
X

ఒక హీరో పేరు చెబితే చాలు.. థియేటర్ దగ్గర టికెట్ల కోసం క్యూ కట్టాలి. సినిమా ఏదైనా సరే.. హీరో ఎవరో చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, అంతా థియేటర్‌ కు పరుగెత్తాలి. అప్పుడు మాత్రమే అది అసలైన స్టార్ పవర్! కానీ పాన్ ఇండియా రేంజ్‌ లో ఆ లెక్క కాస్త డిఫరెంట్‌ గా ఉంది. భారీ యాక్షన్, అదిరిపోయే విజువల్స్, ఫుల్ హైప్ ఉన్న సినిమా వస్తే ఆడియన్స్ ఎగబడుతున్నారు. మరి అవేవీ లేకుండా ఒక స్టార్ సినిమా వస్తే పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ కు అసలు పరీక్షగా మారింది.

ప్రస్తుతం సౌత్ సినిమాలకు క్రేజ్ పెరిగిన తర్వాత హీరోల ఇమేజ్ కూడా మారిపోయింది. ఒకప్పుడు ఒక లాంగ్వేజ్ కు పరిమితమైన మార్కెట్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో పెరిగింది. కానీ ఆ క్రేజ్ వెనుక అసలు కారణం ఏమిటన్నదే ఆసక్తికరమైన విషయం. హీరో ఇమేజ్‌ తో పాటు సినిమా కంటెంట్ కూడా పెద్ద ఎత్తున పనిచేస్తోంది. ముఖ్యంగా భారీ సినిమాలు ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి.

భారీ సెట్స్, యాక్షన్ సీన్స్, పవర్‌ ఫుల్ క్యారెక్టర్స్, ఎమోషన్స్, కొత్త వరల్డ్.. ఇలా స్క్రీన్ పై ఏదైనా గ్రాండ్‌ గా కనిపిస్తే సినిమా రిలీజ్ కు ముందే ఒక రేంజ్ హైప్ వస్తోంది. ఆ సినిమాను థియేటర్‌ లోనే చూడాలనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. అక్కడే ఈవెంట్ సినిమా అనే కండిషన్ వినిపిస్తోంది. ఒక మూవీ సాధారణంగా కాకుండా ఓ పెద్ద ఈవెంట్‌ లా కనిపిస్తే.. ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్‌ గా పెరుగుతోంది.

దీంతో ఓపెనింగ్స్ కూడా భారీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ స్టార్‌ డమ్‌ కు అసలు పరీక్ష అక్కడితో అయిపోలేదు. స్కేల్ తగ్గితే స్టార్ పవర్ ఎంత? అనేదే అసలు ప్రశ్న. రేపు అదే స్టార్ ఒక నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ తో వస్తే? భారీ యాక్షన్ లేకుండా ఓ ప్రేమకథ చేస్తే? భారీ సెట్స్ లేకుండా కేవలం కథ, పాత్రలతో సినిమా తీస్తే? అప్పుడు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ మొదటి రోజే థియేటర్లకు వస్తే.. అదే అసలైన స్టార్ మార్కెట్.

ఎందుకంటే భారీ సినిమా హిట్ కావడం ఒక లెక్క. కానీ హీరో సినిమా కాబట్టి హిట్ కావడం మరో లెక్క. ఆ రెండింటి మధ్యే అసలు స్టార్‌ డమ్ ఉంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు ఒక కొత్త ఫార్ములాను చూపించాయి. స్టార్ ఇమేజ్‌ కు భారీ సినిమా తోడైతే బాక్సాఫీస్ దగ్గర సంచలనం సాధ్యమే. కానీ ఇక ముందు స్టార్‌ డమ్‌ కు మరో మెట్టు ఎక్కాల్సి ఉంటుంది. సినిమా భారీగా లేకపోయినా.. హీరో పేరు ప్రేక్షకులను థియేటర్‌ కు రప్పించాలి.

అందుకే పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ కు అసలు మీటర్ వందల కోట్ల వసూళ్లు కాదు. భారీ ఓపెనింగ్ కూడా కాదు. సినిమా ఎంత పెద్దదైనా సరే.. హీరో కోసం ఆడియన్స్ వస్తారా? అన్నదే అసలు మెజర్మెంట్. ఆ ఆన్సర్ అవును అని వచ్చిన రోజే.. పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్‌ కు పూర్తి అర్థం వచ్చినట్టే అని చెప్పొచ్చు.