Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మూవీ..డైరెక్ట‌ర్ మ‌ళ్లీ అదే త‌ప్పు?

ఇప్పుడు ప్ర‌తి స్టార్ హీరో, డైరెక్ట‌ర్ ఏ ప్రాజెక్ట్ మొద‌లు పెట్టినా పాన్ ఇండియా స్థాయిలోనే చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

By:  Ravindar Gorantla   |   18 Feb 2026 11:00 PM IST
పాన్ ఇండియా మూవీ..డైరెక్ట‌ర్ మ‌ళ్లీ అదే త‌ప్పు?
X

ఇప్పుడు ప్ర‌తి స్టార్ హీరో, డైరెక్ట‌ర్ ఏ ప్రాజెక్ట్ మొద‌లు పెట్టినా పాన్ ఇండియా స్థాయిలోనే చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే అది కొన్ని ప్రాజెక్ట్‌ల విష‌యంలో ఫ‌లిస్తుంటే ఎక్కువ శాతం సినిమాల విష‌యంలో స‌క్సెస్ కావ‌డం లేదు. అనుకున్న విధంగా రాక‌పోవ‌డంతో బ‌డ్జెట్ పెరిగి మేక‌ర్స్‌కి త‌ల‌కు మించి భారంగా మారుతున్నాయి. ఈ స‌మ‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణం వారు ఎంచుకుంటున్న భారీ బ‌డ్జెట్‌లే. ఇప్పుడు ఇదే తప్పుని మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్ చేస్తున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే యంగ్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కించిన సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు క్రేజీ డైరెక్ట‌ర్‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ.300 కోట్ల మార్కుని చేర‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడీ డైరెక్ట‌ర్‌. ఈ మూవీ త‌రువాత బాలీవుడ్ క్రేజీ హీరో తో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేశాడు. అంతా ఓకే అనుకున్న‌స‌మ‌యంలో ఈ ప్రాజెక్ట్ అర్థాంత‌రంగా క్యాన్సిల్ కావ‌డం, ఈ ప్రాజెక్ట్ నుంచి స‌ద‌రు బాలీవుడ్ స్టార్ త‌ప్పుకోవ‌డం జ‌రిగింది. ద‌ర్శ‌కుడికి, హీరోకు మ‌ధ్య బడ్జెట్ ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌డం వ‌ల్లే ఈ ప్రాజెక్ట్ ర‌ద్ద‌యింద‌ని తేలింది.

అయితే పాన్ ఇండియాబ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్‌గా భారీ మూవీని ప్లాన్ చేస్తున్న స‌ద‌రు డైరెక్ట‌ర్ ఈ సీక్వెల్‌కి కూడా అదే పంథాని అనుస‌రిస్తుండ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కోసం క‌న్న‌డ స్టార్ హీరోని రంగంలోకి దించ‌డ‌మే కాకుండా మ‌రో కీల‌క పాత్ర కోసం టాలీవుడ్ హంక్‌ని తీసుకోవ‌డంతో బ‌డ్జెట్ భారీగా పెరుగుతోంద‌ని, ఇది మేక‌ర్స్‌కి భారంగా మారే అవ‌కాశం ఉంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా పెట్టిన బ‌డ్జెట్‌ని రాబట్ట‌లేక‌పోతున్న విష‌యం తెలిసిందే.

దీంతో స్టార్ ప్రొడ్యూస‌ర్లు సైతం న‌ష్టాల‌ని ఎదుర్కొన్నారు. ఈ ప‌రిస్థితిని ప‌రిగ‌ణలోకి తీసుకోకుండా స‌ద‌రు డైరెక్ట‌ర్ పాన్ ఇండియా మూవీ కోసం వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌ని పెంచ‌డం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సాహ‌స‌మే అవుతుంద‌ని, నిర్మాత‌కు పెను భారంగా మారుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. గ‌తంలో చేసిన పాన్ ఇండియా మూవీని ముందు చిన్న సినిమాగా త‌క్కువ బ‌డ్జెట్లో మొద‌లు పెట్టి ఆ త‌రువాత దాన్ని రూ.40 కోట్ల‌కు పెంచ‌డంతో ఇండస్ట్రీలో దీనిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది.

చిన్న హీరో సినిమాకు ఇంత బ‌డ్జెట్ అవ‌స‌ర‌మా?. తెలిసి తెలిసి ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చాలా మంది నిర్మాత‌ని హెచ్చ‌రించారు కూడా. అయితే ల‌క్కీగా ఫైన‌ల్ అవుట్ పుట్ బాగా రావ‌డం, అది ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంతో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన నిర్మాత‌ని ఒడ్డున ప‌డేసింది. భారీ న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని భ‌య‌ప‌డిన నిర్మాత‌కు కోట్ల‌మేర లాభాల్ని తెచ్చి పెట్టింది. అయితే గ‌త అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని స‌ద‌రు డైరెక్ట‌ర్ బ‌డ్జెట్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి డైరెక్ట‌ర్ వింటాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.