Begin typing your search above and press return to search.

పాన్ ఇండియాలో కొడితే ఆ భామ‌ల‌దే హ‌వా!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా అనే పదం హీరోల మార్కెట్‌కే పరిమితం కాలేదు. కథానాయికల సత్తాను చాటే వేదికగా మారుతోంది.

By:  Srikanth Kontham   |   11 Aug 2026 8:00 PM IST
పాన్ ఇండియాలో కొడితే ఆ భామ‌ల‌దే హ‌వా!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా అనే పదం హీరోల మార్కెట్‌కే పరిమితం కాలేదు. కథానాయికల సత్తాను చాటే వేదికగా మారుతోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన నటనకు ఆస్కారం ఉన్న భారీ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటూ టాలీవుడ్- బాలీవుడ్ అనే తేడా లేకుండా నటీమణులు సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న భారీ పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్న కియారా అద్వాణీ, దీపికా పదుకొనే, త్రిప్తి డిమ్రీ, రుక్మిణీ వసంత్ , ప్రియాంక చోప్రా తదితరులు త‌మ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే కొన్ని సంవత్సరాల పాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఈ భామలదే పూర్తి ఆధిపత్యం ఉండబోతుందనడంలో సందేహం లేదు.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనే గురించే. ఇప్పటికే వరుస పాన్ ఇండియా .. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లతో సత్తా చాటుతున్న అమ్మ‌డు ప్రస్తుతం అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ భారీ బడ్జెట్ చిత్రం `రాకా`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలోనూ అత్యంత అంకితభావంతో షూటింగ్‌లో పాల్గొని షాక్ ఇస్తున్నారు . `రాకా` సినిమా కనుక ఘనవిజయం సాధిస్తే బాక్సాఫీస్ వద్ద దీపికా రేంజ్ మరో స్థాయికి వెళ్లడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఆమె స్థానం తిరుగులేనిదిగా మారుతుంది.

అలాగే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందం, అభినయంతో దూసుకుపోతున్న కియారా అద్వాణీ కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అగ్ర హీరోల సరసన క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న అమ్మ‌డు గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ కనుక బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తే దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా హవా నడవడం ఖాయం. కమర్షియల్ సక్సెస్‌తో పాటు నటిగా మరో మెట్టు ఎక్కడానికి ఈ సినిమా ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది.

నేషనల్ క్రష్‌గా యూత్‌ను ఆకట్టుకుంటున్న త్రిప్తి డిమ్రీ కూడా పాన్ ఇండియా రేసులో దూసుకుపోతున్నారు. వరుస క్రేజీ ఆఫర్లతో బిజీగా ఉన్న అమ్మ‌డు భిన్నమైన జోనర్లలో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ఆమె నటిస్తున్న `స్పిరిట్` హిట్ టాక్ తెచ్చుకుంటే ట్రెండింగ్ హీరోయిన్‌గా త్రిప్తి హవా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏకపక్షంగా శాసించడం ఖాయం. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి సహజ నటనతో సౌత్ అండ్ నార్త్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్న రుక్మిణీ వసంత్ పేరు సినీ వర్గాల్లో మార్మోగుతోంది.

ఎంపిక చేసుకునే కథల్లో జీవిస్తూ నటనకు పెద్దపీట వేస్తున్న అమ్మ‌డు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో భాగమవుతున్నారు. రుక్మిణీ వసంత్ నటిస్తున్న డ్రాగ‌న్ గ‌నుక‌ కనుక అంచనాలను అందుకుని విజయం సాధిస్తే అమ్మ‌డికి తిరుగుండ‌దు. వీరితో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ కీర్తిని చాటుతోన్న ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ స్క్రీన్‌పై సత్తా చాటడానికి సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు న‌టిస్తోన్న వార‌ణాసి గ‌నుక 120 దేశాల్లో స‌క్సెస్ అయితే? పీసీ క్రేజీ గ్లోబ‌ల్ రేంజ్లో తారా స్థాయికి చేరుతుంది.