హీరోయిన్ల గ్లామర్ మంత్రం - స్టార్‌డమ్ కోసం సరికొత్త ఫార్ములా!
ప్రస్తుత పాన్-ఇండియా సినిమా యుగంలో నటనతోనే కాదు. గ్లామర్ అప్పీల్‌తోనూ బాక్సాఫీస్ వద్ద భారీ క్రేజ్ సొంతం చేసుకోవడం సరికొత్త ట్రెండ్‌గా మారింది.
By: Srikanth Kontham | 21 May 2026 8:44 PM ISTప్రస్తుత పాన్-ఇండియా సినిమా యుగంలో నటనతోనే కాదు. గ్లామర్ అప్పీల్‌తోనూ బాక్సాఫీస్ వద్ద భారీ క్రేజ్ సొంతం చేసుకోవడం సరికొత్త ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదాను అందుకోవాలన్నా? కమర్షియల్ చిత్రాలలో క్రేజీ ఆఫర్లను దక్కించుకోవాలన్నా? గ్లామర్ షో అనేది ప్రధాన అస్త్రంగా మారుతోంది. కథలకే పరిమితం కాకుండా? తమ స్క్రీన్ ప్రెజెన్స్ , గ్లామర్ మంత్రంతో ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టేలా సరికొత్త ఫార్ములాను నేటి తరం కథానాయికలు ఫాలో అవుతున్నారు. ఈ రేసులో బాలీవుడ్ ఇంపోర్ట్స్ నుండి రీజినల్ బ్యూటీల వరకు అందరూ ముందంజలో ఉన్నారు.
ఈ ట్రెండ్‌కు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. `దేవర` చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ గ్లామర్ పరంగా సోషల్ మీడియాను ఏ విధంగా ఊపేసిందో తెలిసిందే. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `పెద్ది` చిత్రంలోనూ జాన్వీ మోస్ట్ స్టైలిష్ అండ్ గ్లామరస్ రోల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. నార్త్ మార్కెట్‌తో పాటు సౌత్ ఆడియన్స్‌ను మెప్పించడానికి ఈ చిత్రంలో గ్లామర్ ఎలిమెంట్స్ జాన్వీ కెరీర్‌కు మైలేజ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
హోమ్‌లీ అండ్ క్యూట్ లుక్స్‌తో అలరించే మలయాళ కుట్టి మమితా బైజు సైతం ఈసారి రూట్ మార్చారు. `ప్రేమలు` సినిమాతో లవర్ బాయ్స్ హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `విశ్వనాథ్ అండ్ సన్స్` లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం మమితా కెరీర్‌లో తొలిసారిగా గ్లామర్ డోస్ పెంచినట్లు టాక్. క్యూట్‌నెస్ తో పాటు వెండితెరపై సరికొత్త గ్లామర్ ట్రాక్ అమ్మడికి టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
టాలీవుడ్‌లో లక్కీ ఛాన్స్ దక్కించుకున్న నయా సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే సైతం గ్లామర్ బాటలోనే పయనిస్తున్నారు. మొదటి చిత్రం నుండే అందాల ఆరబోతతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ దూసుకుపోతున్న భామ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. పాన్-ఇండియా మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి -స్టార్ హీరోల సరసన క్రేజీ అవకాశాలను లైన్‌లో పెట్టడానికి గ్లామర్ మంత్రమే అసలైన షార్ట్‌కట్ అని ఈ భామల కెరీర్ గ్రాఫ్ చూస్తే అర్థమవుతోంది. ఇదే దారిలో ప్రయాణిస్తూ నయా పాన్-ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు నార్త్ బ్యూటీ కయాదు లోహర్ నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా `ది పారడైజ్` చిత్రంలో సుబ్బలక్ష్మి అలియాస్ సుబ్బు పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో కథ పరంగా నటనకు స్కోప్ ఉన్నా? కయాదు లోహర్ మాత్రం నటన కంటే గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రమోషన్ల ద్వారా తన పాపులారిటీని పెంచుకోవాలని చూస్తున్నారు. నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకోవడానికి గ్లామర్ బాటను ఆమె పక్కాగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సినిమాల్లో కంటెంట్ - పెర్ఫార్మెన్స్ ఎంత ముఖ్యమో? కమర్షియల్ పరంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి హీరోయిన్ల గ్లామర్ గ్లో కూడా అంతే అవసరమని మేకర్స్ భావిస్తున్నారు. జాన్వీ `పెద్ది`, మమితా `విశ్వనాథ్ అండ్ సన్స్`, కయాదు లోహర్ `ది పారడైజ్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయో చూడాలి. ఈ సినిమాల ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో హీరోయిన్ల స్టార్‌డమ్ -కాస్టింగ్ సమీకరణాలలో గ్లామర్ ఫార్ములా ఏ స్థాయిలో పనిచేస్తుందో క్లారిటీ దొరుకుతుంది.
