హీరోయిన్ల కెరీర్ కి పాన్ ఇండియా డ్యామేజ్!
కానీ అదే సినిమాలో హీరోయిన్ గా..తల్లిగా నటించిన అనుష్కకు మాత్రం డ్యామేజ్ గానే ఆ చిత్రం మారింది. ఆ సినిమా తర్వాత నటిగా మరింత బిజీ అవుతుందనుకున్నారు.
By: Srikanth Kontham | 28 Sept 2025 9:30 AM ISTస్టార్ హీరోయిన్లకు పాన్ ఇండియా చిత్రాలు డ్యామేజ్ గా మారాయా? పాన్ ఇండియా విజయాలు కలిసొ స్తాయనుకుంటే? అంతకంతకు పాతాళానికి తొక్కకేస్తున్నాయా? అంటే కొంత మంది హీరోయిన్ల పరిస్థితి అలాగే కనిపిస్తోంది. `బాహుబలి`తో అనుష్క పాన్ ఇండియాలో ఓ సంచలనంగా మారింది. 2000 కోట్ల రూపాయల వసూళ్ల చిత్రంలో భాగమైన తొలి సౌత్ నటిగా రికార్డు సృష్టించింది. సౌత్ నుంచి రిలీజ్ అయిన తొలి భారీ బడ్జెట్ చిత్రం కూడా అదే. ఆ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇతర నటీనటులు..టెక్నీషియన్లకు ఇండియా వైడ్ మంచి గుర్తింపు దక్కింది.
హీరోయిన్ గా అవకాశాలే రాలేదు:
కానీ అదే సినిమాలో హీరోయిన్ గా..తల్లిగా నటించిన అనుష్కకు మాత్రం డ్యామేజ్ గానే ఆ చిత్రం మారింది. ఆ సినిమా తర్వాత నటిగా మరింత బిజీ అవుతుందనుకున్నారు. బాలీవుడ్ అవకాశాలతో అమ్మడి రేంజ్ మారిపోతుం దని అంతా ఆశించారు. కానీ ఆ సినిమా తర్వాత అనుష్క నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు హిట్ సంగతి పక్కన బెడితే హీరోయిన్ గా సరైన అవకాశాలే రాలేదు. చివరకు మాలీవుడ్ వెళ్లాల్సి వచ్చింది. ముంబై బ్యూటీ పూజాహెగ్డే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. `రాధేశ్యామ్` తో పాన్ ఇండియాలోకి అడుగు పెట్టింది.
ప్రయత్నించినా ఫలించలేదే:
కానీ ఆసినిమా డిజాస్టర్ అవ్వడం తో మార్కెట్ లో తేలిపోయింది. ఆ తర్వాత నటించిన మరో పాన్ ఇండియా `బీస్ట్` కూడా అలాంటి రిజల్టే ఇచ్చింది. అటుపై రిలీజ్ అయిన `సిర్కస్`, `కిసీకా భాయ్ కిసీకా జాన్`, `దేవా`, `రెట్రో` చిత్రాలు ప్లాప్ గానే మిగిలాయి. రీసెంట్ రిలీజ్ `కూలీ`లో మోనికా పాటతో ఇండియాని ఊపేసినా సినిమా ఫలితం మాత్రం తేడాగా రావడంతో? ఎఫెర్ట్ అంతా వృద్ధా ప్రయత్నంగా మిగిలిపోయింది. `జననాయగన్` తోనైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిస్తోంది. ఇక సమంత పాన్ ఇండియా సినిమాలు చేయలేదు గానీ..పాన్ ఇండియాలో ఆలోచనలు చేసింది.
పాన్ ఇండియా ప్లాన్ ఫెయిల్:
ఈ క్రమంలోనే బాలీవుడ్ వెళ్లి అక్కడ నుంచి జెండా పాతాలని చూసింది. కానీ అమ్మడి ప్లాన్ వర్కౌట్ కాలేదు.` ఖుషీ` రిలీజ్ అనంతరం బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నా ఇంత వరకూ ఒక్క సినిమాకు సైన్ చేయలేదు. తెలుగులో అవకాశాలు కూడా కోల్పోతుంది. తమన్నా `ఊ` కొడితే టాలీవుడ్ లో అవకాశాలు వచ్చేవి. కానీ అమ్మడు అంతకు మించి ఏదో చేయాలని భావించి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అక్కడ ప్రయత్నాలు చేస్తూనే సౌత్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తోంది. కానీ ఏం? లాభం తాను వేసిన పాన్ ఇండియా ప్లాన్ మాత్రం ఇంత వరకూ వర్కౌట్ అవ్వలేదు.
