Begin typing your search above and press return to search.

గ్లోబ‌ల్ స్టార్ అక్క‌డ ఫోర్త్ ప్లేస్‌లో కూడా లేడా?

అయితే ఈ రేసులో ఇద్ద‌రు ముగ్గురు స్టార్ హీరోలు వెన‌క‌బ‌డిపోయారు. వారిలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డ‌? ఏ స్థానంలో ఉన్నార‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

By:  Ravindar Gorantla   |   4 March 2026 5:00 AM IST
గ్లోబ‌ల్ స్టార్ అక్క‌డ ఫోర్త్ ప్లేస్‌లో కూడా లేడా?
X

టాలీవుడ్ స్టార్ హీరోల్లో నెంబ‌రింగ్ గేమ్ ప్ర‌ధానంగా న‌డుస్తోంది. పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఏ స్టార్ హీరో బాక్సాఫీస్ స‌త్తా ఎంత అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే కొంత మంది హీరోలు త‌మ క్రేజీ మూవీల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా వంద‌ల కోట్ల వసూళ్ల‌ని రాబ‌ట్టి టాప్ పొజీష‌న్‌లో ఉన్నారు. అయితే ఈ రేసులో ఇద్ద‌రు ముగ్గురు స్టార్ హీరోలు వెన‌క‌బ‌డిపోయారు. వారిలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డ‌? ఏ స్థానంలో ఉన్నార‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

`బాహుబ‌లి` సిరీస్‌తో పాన్ ఇండియా రేస్‌కు ప్ర‌భాస్ శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ పార్ట్‌కి మించి `బాభుబ‌లి 2` వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1805 కోట్లు రాబ‌ట్టింది. దీంతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరిపోయాడు. టాలీవుడ్ హీరోల్లో మొట్ట‌మొద‌టి పాన్ ఇండియా స్టార్‌గా రికార్డు సాధించాడు. ఆ త‌రువాత కూడా అదే త‌ర‌హాలో భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ని కొల్ల‌గొడుతున్నాడు. ఫ‌స్ట్ ప్లేస్‌లో ప్ర‌భాస్ స్థిర‌ప‌డిపోవ‌డంతో త‌రువాతి స్థానం ఎవ‌రిదిన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ త‌రువాత ప్లేస్‌ని ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకుని అంద‌రికి షాక్ ఇచ్చాడు. బ‌న్నీ న‌టించిన `పుష్ప 2` మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై ఆస‌క్తిక‌ర‌మైన కంటెంట్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1705 కోట్లు రాబ‌ట్టి బ‌న్నీని రెండ‌వ స్థానంలో నిల‌బెట్టింది. ప్ర‌స్తుతం బ‌న్నీ ఈ రేంజ్‌కి మించిన సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు.

ఇక మూడ‌వ స్లేస్‌ని గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ద‌క్కించుకుంటాడ‌ని అంతా భావించారు కానీ ఆ స్థానాన్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టించిన యాక్ష‌న్ డ్రామా `దేవ‌ర‌`. ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌లో న‌టించిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై ఆశించిన స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఫైన‌ల్‌గా రూ.420 కోట్ల‌ని రాబట్టి పాన్ ఇండియా స్టార్‌ల రేస్‌లో వ‌సూళ్ల ప‌రంగా ఎన్టీఆర్‌ని నాలుగ‌వ స్థానంలో నిల‌బెట్టింది.

ఇదిలా ఉంటే స్టార్ హీరోలంతా పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ల కోసం ఎదురు చూస్తున్న వేళ సైలెంట్‌గా వ‌చ్చేసి తేజ స‌జ్జ ఫిప్త్ ప్లేస్‌ని ఆక్ర‌మించేశాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందిన ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీ `హ‌ను మాన్‌`. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుని బాక్సాఫీస్ వ‌ద్ద రూ.296 కోట్లు రాబ‌ట్టింది. ఈ సంక్రాంతి విడుద‌లైన `మ‌న శంక‌ర‌ప్ర‌సాద్‌గారు`తో (295 కోట్లు) మెగాస్టార్ ఆర‌వ ప్లేస్‌ని, రూ.286 కోట్ల‌తో ఓజీ మూవీతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏడ‌వ ప్లేస్‌ని, సంక్రాంతికి వ‌స్తున్నాం` (260 కోట్లు)తో వెంక‌టేష్ ఎనిమిద‌వ ప్లేస్‌ని, `రంగ‌స్థ‌లం` (215 కోట్లు)తో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ తొమ్మిద‌వ ప్లేస్‌ని, స‌రిలేరు నీకెవ్వ‌రు (210 కోట్లు)తో మ‌హేష్ ప‌ద‌వ ప్లేస్‌ని ద‌క్కించుకున్నారు. రానున్న `పెద్ది`, వార‌ణాసి సినిమాల‌తో ఈ ప్లేస్‌లు మారే అవ‌కాశం ఉంది.