బన్నీ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించే ట్రీట్..!
పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న అట్లీ డైరెక్షన్ సినిమా మీద అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
By: Ramesh Boddu | 21 Sept 2025 6:00 PM ISTపుష్ప తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న అట్లీ డైరెక్షన్ సినిమా మీద అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు అట్లీ. ఇదేదో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాగా వచ్చేలా ఉందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అట్లీ ఈ సినిమాలో ప్రతి అంశాన్ని ఎంతో ప్లానింగ్ తో చేస్తున్నాడు. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా వస్తుంది. అందుకే సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ కొన్నేళ్లు గుర్తుండిపోయేలా చేస్తున్నారట.
ఈ ఎపిసోడ్ చెప్పే అల్లు అర్జున్ ని ఒప్పించారా..
అట్లీ అల్లు అర్జున్ కాంబో సినిమాలో స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఇది సినిమా హైలెట్ సీన్స్ లో ఒకటని తెలుస్తుంది. ఈ సీన్ లో అల్లు అర్జున్ గెటప్ వేరే లెవెల్ అని టాక్. అట్లీ ఈ ఎపిసోడ్ చెప్పే అల్లు అర్జున్ ని ఈ సినిమాకు ఒప్పించాడని టాక్. సినిమాలో కీలకమైన ఈ స్పెషల్ యాక్షన్ సీన్ ని ఎంతో జాగ్రత్తగా చేస్తున్నారట. అల్లు అర్జున్ ఇమేజ్ మరింత పెంచేలా గ్లోబల్ లెవెల్ లో రీచింగ్ వచ్చేలా ఈ సినిమా చేస్తున్నారట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకొనె ఫిక్స్ అయ్యింది. సినిమాలో ఆమె రోల్ కూడా చాలా బాగుంటుందని టాక్. దీపికా మాత్రమే కాదు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతారట. పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ అట్లీతో సినిమా ఆ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా చేయాలని చూస్తున్నారు. అట్లీ అయితే అల్లు అర్జున్ డెడికేషన్ కి షాక్ అయ్యాడని తెలుస్తుంది.
డే అండ్ నైట్ కష్టపడి అనుకున్న డేట్ కి తీసుకొచ్చే..
అల్లు అర్జున్ అట్లీ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ బజ్ ఉంది. 2027 సెకండ్ హాఫ్ లోనే సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం డే అండ్ నైట్ కష్టపడి అయినా అనుకున్న డేట్ కి తీసుకొచ్చే ప్లానింగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో దానికి తగిన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.
అట్లీ కూడా బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. జవాన్ తో బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నాడు కాబట్టి అతనికి డిమాండ్ బాగుంది. కేవలం రెమ్యునరేషన్స్ తోనే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అల్లు అర్జున్ 22వ సినిమాగా వస్తున్న ఈ మూవీ మరోసారి అల్లు ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. ఈ సినిమా నుంచి దసరాకి ఒక స్పెషల్ అప్డేట్ వస్తుందని తెలుస్తుంది.
